శంకుస్థాపనలు.. ప్రారంభోత్సాలు.. ఆ నియోజకవర్గాలు స్పెషల్ గురూ..!
రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నా.. కొన్ని నియోజకవర్గాలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.;

రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నా.. కొన్ని నియోజకవర్గాలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇక్కడ నిరంతరం.. శంకుస్థాపనలు.. ప్రారం భోత్సావాలు కామన్‌గా జరుగుతుండడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడతారు. రహదారులు నిర్మిస్తారు. కాల్వలు తీయిస్తారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.
కానీ.. ప్రభుత్వం నుంచి సాయం అందకపోయినా.. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు. వీరు ఎన్నారైల నుంచి కొంత మొత్తాన్ని పోగు చేస్తున్నారు. మరికొందరు తమ సొంత నిధులు కూడా వెచ్చిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వం నుంచి నిబద్ధతగా తీసుకుంటున్న సొమ్ములను ఆయా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఇలా.. కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యే కంగా నిలుస్తున్నారు.
బాపట్ల: బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ.. ఆది నుంచి కూడా నియోజకవర్గంపై అభిమానంతో అనేక పనులు చేశారు. ఇక్కడి ప్రజలకు వాటర్ ట్యాంకుల పంపిణీ నుంచి దస్తుల పంపిణీ వరకు ఆయన చేప ట్టారు. ఇక, ఇప్పుడు వేసవిని దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల కు ఉదయాన్నే ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధాన కాలువల్లో దగ్గరుండి మరీ స్టిల్ట్‌ను తీయిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో రోజూ ఏదో ఒక పని జరుగుతూనే ఉంది.
గుడివాడ: గుడివాడ ఎమ్మెల్యే రాము కూడా.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం గుడివాడలో రహదారుల బాగు చేతకు ప్రభుత్వం ఇస్తున్న నిధులతోపాటు ఎనారైల నుంచి కూడా నిధులు సేకరించి.. సర్వాంగ సుందరంగా చేపడుతున్నారు. కాలువలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. రహదారులను విస్తరిస్తున్నారు.
నెల్లూరు రూరల్: ఈ నియోజకవర్గం గురించి అందరికీ తెలిసిందే. పనిరాక్షసుడిగా పేరు తెచ్చుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎండా వానా లెక్క చేయకుండా పనులు చేయిస్తున్నారు. రహదారుల విస్తరణ నుంచి కాల్వలు, వంతెనల మరమ్మతుల వరకు కూడా.. పనులు చేపట్టారు. నిరంతరం పనులు పర్యవేక్షిస్తూ.. తనకంటూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇలా.. ఆయా నియోజకవర్గాల్లో నిరంతరం ఏవో పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉండడం గమనార్హం.