మహిళా మంత్రి ఫిర్యాదు... లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎమ్మెల్సీ అరెస్ట్!

ఈ నెల 9వ తేదీ నుంచి కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-20 05:27 GMT

ఈ నెల 9వ తేదీ నుంచి కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. తనను కించపరిచేలా ప్రవర్తించారంటూ ఓ మహిళా మంత్రి ఫిర్యాదు చేయడంతో.. బీజేపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు.

అవును... కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ లోని భారతీయ జనతాపార్టీ సభ్యుడు సిటీ రవిపై ఎఫ్.ఐ.అర్. నమోదు కావడంతో ఆయనను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకముందు రోజు శాసన మండలిలో కాంగ్రెస్ నాయకురాలు, కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ పై కించపరిచే పదాన్ని ఉపయోగించారని కేసు నమోదైంది.

తనను కించపరిచేలా మాట్లాడారంటూ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ పై హిరేబాగేవాడీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. భారత న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్.) సెక్షన్ 75 (లైంగిక వేధింపులు), సెక్షన్ 79 (పదాలు, సంజ్ఞలు, శబ్ధాలతో స్త్రీ అణకువను అవమానించే చర్య) కింద కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యలో రవిని బెంగళూరు తీసుకొచ్చి, శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచనున్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

కాగా... బెళగావిలోని కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన గురువారం రాష్ట్ర మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ శాసన మండలిలో ప్రసగింస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి.. తనపై అసభ్యకరమైన పదాన్ని ఉపయోగించారని ఆమె ఆరొపించారు. దీనిపై మండలి ఛైర్మన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో.. ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. అటూంటి బాషను ఉపయోగించడం లైంగిక వేధింపులకు పాల్పడటం కిందకే వస్తుందని పేర్కొన్నారు!

Tags:    

Similar News