నోరు విప్పండి మోడీషా.. రాహుల్ చెప్పిన చైనా కబ్జా సంగతేంటి?

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో జరిగిన జీరో అవర్ లో సంచలన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.;

Update: 2025-04-04 04:59 GMT
నోరు విప్పండి మోడీషా.. రాహుల్ చెప్పిన చైనా కబ్జా సంగతేంటి?

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేవారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో జరిగిన జీరో అవర్ లో సంచలన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మన దేశానికి చెందిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా అక్రమించినట్లుగా రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

భారత భూభాగంలోని 4 వేల చదరపు కిలోమీటర్ల పరిధిని చైనా అక్రమించిందని.. అయినా మన విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రం మిస్త్రీ.. చైనా రాయబారితో కలిసి రెండు దేశాల 75 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా కేక్ కట్ చేయటం తనను షాక్ కు గురి చేసినట్లుగా పేర్కొన్నారు. చైనా కబ్జాలోకి వెళ్లిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చైనా తీసుకుందా? అన్నదే తన సూటి ప్రశ్నగా రాహుల్ పేర్కొన్నారు.

తాను లేవనెత్తిన ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సమాధానం ఇవ్వాలని కోరారు. రాహుల్ చేసిన తాజా ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. అయితే.. ఈ ఆరోపణ మీద ప్రధానమంత్రి నరేంద్రమోడీ కానీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా,.. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాత్రం ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు అర్థం లేనివిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళలోనూ చైనా భారత భూభాగాన్ని అక్రమించినట్లుగా పేర్కొన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రాహుల్ లేవెత్తిన అంశానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని మోడీషాలలో ఎవరో ఒకరు బయటపట్టాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News