బాబు - పవన్‌లకు మోడీ బిగ్ టాస్క్ .. !
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇమేజ్‌లను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు బిగ్ టాస్క్ అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇమేజ్‌లను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వారికి బిగ్ టాస్క్ అప్పగించారు. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. స్థానిక ఎన్సీపీ, శివసేనలతో కలిసి పోరాడుతోంది.
అయితే.. అనుకున్న రేంజ్‌లో అయితే ప్రచారం ముందుకు సాగడం లేదు. స్థానికంగా ఎదురవుతున్న చిక్కులు.. వీటికితోడు ఉన్న సమస్యలతో నాయకులు వారి వారి నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. దీంతో బీజేపీ తరఫున బలమైన గళం వినిపించేవారు కావాల్సి ఉంది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను మహారాష్ట్రలో మోహరించారు. అయితే.. తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నాయకత్వ కొరత వెంటాడుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలను మోహరించి ప్రచారాన్ని దూకుడుగా చేస్తోం ది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అక్కడే ఉంటూ.. ప్రచారాన్ని ముం దుకు తీసుకువెళ్తున్నారు. ఈ ప్రభావంతో బీజేపీ ఇప్పుడు ఏపీ, తెలంగాణల నుంచి నాయకులను పంపిస్తోంది. తెలంగాణకుచెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పది మంది వరకు మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు.
అదేసమయంలో ఏపీ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు కూడా.. తరచుగా మహారాష్ట్ర ప్రచారానికి వెళ్తున్నారు. అయితే.. వీరి కంటే కూడా..చంద్రబాబుకు ఉన్న ఇమేజ్, పవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌లను వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే వారిని కూడా నాదేండ్ సహా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న షిర్డీ వంటి చోట్ల ప్రచారం చేయించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. దీంతో వారికి స్వయంగా ఆయన ఆహ్వానాలు పంపి.. 16, 17 తేదీలను కూడా ఫిక్స్ చేశారు. మరి ఏమేరకు వీరు టాస్క్ పూర్తి చేస్తారో చూడాలి.