మోడీకి 14 దేశాల్లో 16 అత్యున్నత పురస్కారాలు... వివరాలివిగో!

ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధానం చేసీన్ అవార్డును గుర్తు చేశారు.

Update: 2024-07-11 13:29 GMT

భారత ప్రధాని నరేంద్ర మోడీకి 2014 నుంచి ఇప్పటి వరకూ 14 దేశాలు 16 అత్యున్నత జాతీయ పురస్కారాలను అందజేశాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ వెల్ల్డించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి గురువారం రాజ్యసభకు వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధానం చేసీన్ అవార్డును గుర్తు చేశారు.

అవును... 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటినుంచి నేటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలు అత్యున్నత జాతీయ పురస్కారాలను అందజేశాయని రాజ్యసభలో నేడు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. ఇదే సమయంలో... అత్యున్నత పర్యావరణ అవార్డును ఐక్యరాజ్య సమితి మోడీకి ప్రధానం చేసిందని గుర్తుచేశారు. రాజ్యసభలో వీటికి సంబంధించిన వివరాలనూ తెలిపారు.

ఆ అవార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి!:

ఆఫ్ఘనిస్తాన్ (2016) – స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్

సౌదీ అరేబియా (2016) - రాజు అబ్దుల్ అజీజ్ సాష్

పాలస్తీనా (2018) – గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు

బహ్రెయిన్ (2019) – కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్

మాల్దీవులు (2019) – ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్

రష్యా (2019) - ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2019) – ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు

యునైటెడ్ స్టేట్స్ (2020) – లెజియన్ ఆఫ్ మెరిట్

ఓషియానియా (2023) - ఎబకల్ అవార్డు

భూటాన్ (2021) – ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ (డ్రుక్ గ్యాల్పో)

ఫ్రాన్స్ (2023) – గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్

ఈజిప్ట్ (2023) - ఆర్డర్ ఆఫ్ నైలు

పాపువా న్యూ గినియా (2023) – గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు

ఫిజీ (2023) - ఆర్డర్ ఆఫ్ ఫిజీ

భూటాన్ (2024) – డ్రక్ గ్యాల్పో ఆర్డర్

రష్యా (2024) - ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్

Tags:    

Similar News