వీల్ చైర్ లో ఎంట్రీ... కాంగ్రెస్ ప్రధానిపై మోడీ ప్రశంసలు!

అవును... మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ మన్మోహన్ సింగ్‌ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.

Update: 2024-02-08 09:40 GMT

సాధారణంగా పార్లమెంట్ ఉభయ సభలకూ హాజరయ్యే ఎంపీల అటెండెన్స్ పై ఆసక్తీక్రమైన చర్చ జరుగుతుంటుంది. ప్రధానంగా రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కాబడినవారి అటెండెన్స్... పార్లమెంట్ సమావేశాల్లో అతిస్వల్పంగా ఉంటుండగా.. మరికొంతమందిది చెప్పుకుంటే సిగ్గు చేటు అన్నట్లుగా కూడా ఉంటుందని అంటుంటారు! అందులో చాలా మంది ప్రముఖులే ఉనారనే కథనాలు నిత్యం వినిపిస్తుంటాయి!

ఆ నిబద్ధత లేని, క్రమశిక్షణ లేని, ప్రజాసేవకులం అని చెప్పుకునే పార్ట్ టైం పొలిటీషియన్స్ సంగతి కాసేపు పక్కనపెడితే... మరికొంతమంది మాత్రం రాబోయే తరాలకు ఎంతో ఆదర్శప్రాయంగా నడుచుకుంటూ ఉంటారు. వారి కమిట్ మెంట్ చూస్తే ప్రత్యర్థులు సైతం ప్రశంసించకుండా ఉండలేరు! ఈ సందర్భంగా అలాంటి ఆదర్శవంతుడైన పార్లమెంటేరియన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.

అవును... మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ మన్మోహన్ సింగ్‌ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వీల్ చైర్‌ లో కూడా సభకు వచ్చి పనిచేశారని గుర్తు చేశారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ... ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ పై ఆసక్తికర వ్య్యాఖ్యలు చేస్తూ... మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని... "సభలో మన్మోహన్‌ అందించిన సహకారం అపారం.. ఆయన దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది.. ట్రెజరీ బెంచ్‌ గెలుస్తుందని తెలిసినా కూడా ఆయన వీల్‌ ఛైర్‌ లో వచ్చి మరీ ఓటు వేశారు.. సభ్యులు తన విధుల పట్ల బాధ్యతగా ఉండాలనేందుకు ఇదో ఉదాహరణ.. ఆయన ఎవరి కోసం వచ్చారన్నది ప్రశ్న కాదు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వచ్చారని మాత్రం నమ్ముతున్నాను" అంటూ అభినందించారు!

మరోవైపు.. పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలోని ఛైర్మన్ జగదీప్ ధన్‌ ఖడ్ నివాసంలో నేడు వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్‌ లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫొటోలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం ఛైర్మన్ నివాసంలో వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు.


Tags:    

Similar News