టాలీవుడ్ ట్రిపుల్ ఆర్ .. తెలంగాణ ప్రభుత్వం డబల్ ఆర్

డబుల్ ఆర్ అంటే మీకు అర్దమై ఉంటుందని అంటూ పరోక్షంగా ప్రధాని రాహుల్, రేవంత్ ల పేర్లను ఉటంకించారు.

Update: 2024-05-01 00:30 GMT

‘తెలుగు సినిమా ఇండస్ట్రీ ట్రిపుల్ ఆర్ లాంటి హిట్ సినిమాను అందిస్తే .. తెలంగాణ ప్రభుత్వం డబుల్ ఆర్ టాక్స్ ను వసూలు చేస్తూ బ్లాక్ మనీ రూపంలో తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీకి పంపుతుందని’ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నాడు.

డబుల్ ఆర్ అంటే మీకు అర్దమై ఉంటుందని అంటూ పరోక్షంగా ప్రధాని రాహుల్, రేవంత్ ల పేర్లను ఉటంకించారు. కాంగ్రెస్ హయాంలో దేశం అవినీతి మయం అయిందని, మళ్లీ పాత రోజులను తెచ్చే ప్రయత్నం చేస్తుందని, అందుకే బీజేపీని అధికారంలోకి తేవాలని మోదీ సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారసత్వంగా వచ్చిన ఆస్తుల మీద కూడా పన్ను వేస్తుందని, అప్పుడు మన సంపాదనలో 55 శాతం మన పిల్లలకు దక్కకుండా ప్రభుత్వం లాక్కుంటుందని, దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు రక్షణ ఉండదని, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల అవినీతి మీద పదేపదే మాట్లాడిందని, ఇప్పుడు మాత్రం ఆ అవినీతి ఫైళ్లను తొక్కి పెట్టిందని మోదీ ఆరోపించారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని, క్వింటాలు ధాన్యానికి బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని మోదీ విమర్శించారు.

Tags:    

Similar News