మోడీ బిగ్ టార్గెట్.. అప్పటి వరకు ఆయనే పీఎం?
వ్యక్తులైనా నాయకులైనా టార్గెట్‌లు పెట్టుకోవాల్సిందే. దూకుడు ప్రదర్శించాల్సిందే.
వ్యక్తులైనా నాయకులైనా టార్గెట్‌లు పెట్టుకోవాల్సిందే. దూకుడు ప్రదర్శించాల్సిందే. అప్పుడే ఏ రంగంలో అయినా.. విజయం దక్కించుకుంటారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎవరూ ఊహించని టార్గెట్‌ను పెట్టుకున్నారు. అప్పటి వరకు ఆయనే ప్రధానిగా ఈ దేశాన్ని ఏలాలని భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే ఆయన ఎవరూ ఊహించని రీతిలో తన లక్ష్యాన్ని వెల్లడించారు. 2047 వరకు ఈ దేశం కోసం పనిచేయాలని ఆ దేవుడు తనను ఆదేశించినట్టు చెప్పారు.
అప్పటి వరకు తాను ఈదేశం కోసం పనిచేస్తూనే ఉంటానని.. వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తానని.. దేశాన్ని ముందుకు నడిపిస్తానని కూడా ప్రధాని చెప్పారు. దేశానికి చేయాల్సినవి చాలానే ఉన్నాయని చె ప్పారు. ఇప్పటి వరకు గడిచిన పదేళ్లలో జరిగింది కేవలం ప్రయోగాత్మకమేనని తెలిపారు. అసలు పనంతా ముందుందని చెప్పారు. అందుకే.. ఈ పని కోసమే.. ఈ పనిని పూర్తి చేయడం కోసమే దేవుడు తనను ఆదేశించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.
అయితే.. మోడీ చెప్పిన టార్గెట్ ప్రకారం 2047 వరకు ఆయనే పీఎంగా ఉండాలి. అంటే.. సుమారు మరో 23 సంవత్సరాలపాటు ఈ దేశాన్ని ఆయనే పాలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనిని మాట వరసకు చెప్పారో.. లేక నిజమేనని అనుకున్నారో తెలియదు కానీ.. అప్పటి వరకు మోడీ ఆరోగ్యంగానే ఉన్నా.. పాలన సాగించేంత శక్తి ఉంటుందా? అన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుతం మోడీ వయసు 75 సంవత్సరా లు. దీనికి 24 కలిపితే.. 99 ఏళ్లు వస్తాయి . మరి అప్పటి వరకు ఆయనే పాలించాలని కోరుకుంటున్నారా? అనేది సందేహం.
మోడీ వ్యాఖ్యల అంతరార్థం వేరేగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను మానసికంగా.. దెబ్బకొట్టే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎప్పటికీ.. మీకు(కాంగ్రెస్) అధికారం రాదు.. అని చెప్పడం ద్వారా ఆ పార్టీ శ్రేణులను బలహీన పరచడం.. మానసికంగా.. వారిని కుంగిపోయేలా చేయడం వంటివి రాజకీయాల్లో వ్యూహం. సో.. ఈ వ్యూహం ప్రకారమే మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.