మోహన్ బాబు దాడి... మూడు చోట్ల విరిగిన రిపోర్టర్ దవడ ఎముక!
అవును... మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఏడీజీపీ ఆఫీసుకు వెళ్లి వచ్చిన అనంతరం మనోజ్ లోనికి రాకుండా గేట్లు వేశారు సెక్యూరిటీ.
జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా బీ.ఎన్.ఎస్. సెక్షన్ 118 కింద పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. మరోపక్క.. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని అంతా ముక్థకంఠతో ఖండిస్తున్నారు! ఈ సమయంలో మరో దారుణం వెలుగు చూసింది!
అవును... మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఏడీజీపీ ఆఫీసుకు వెళ్లి వచ్చిన అనంతరం మనోజ్ లోనికి రాకుండా గేట్లు వేశారు సెక్యూరిటీ. దీంతో... ఆవేశంగా గేట్లు బద్దలు కొడుతూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తన బౌన్సర్లను వెంటపెట్టుకుని బయటకు వచ్చిన మోహన్ బాబు ఆవేశంతో మీడియాపై దాడి చేశారు!
ఈ సమయంలో... మీడియా మైక్ లాక్కొని దాడికి తెగబడ్డారు మోహన్ బాబు. ఇదే క్రమంలో... టీవీ9 ప్రతినిధిపై విచక్షణా రహితంగా మోహన్ బాబూ దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలూ అయ్యాయి! దీంతో... మోహన్ బాబు వైఖరిని ఖండిస్తు, తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
మోహన్ బాబు చేసిన దాడిలో టీవీ9 ప్రతినిధికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో భాగంగా... కంటికి చెవికి మధ్య తీవ్ర గాయం అయ్యింది. ఈ సమయంలో నొప్పితో విలవిల్లాడుతూ శంషాబాద్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో స్కానింగ్ చేసిన వైద్యులు.. జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల ప్రాక్చర్ అయ్యిందని నిర్ధారించారని అంటున్నారు.
దవడ పై భాగంలో ఉండే ఈ జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల విరిగినట్లూ తేలడంతో అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడిని యావత్ మీడియా ప్రతినిధులతో పాటు ప్రజానికం, నాయకులు ఖండిస్తున్నారు!