ఇది వెబ్ సీరిస్ కాదు.. రియల్ స్టోరీ.. ట్విస్టులే ట్విస్టులు

ఉత్తరప్రదేశ్ లోని ‘‘ఎటా’’ అనేది ఒక జిల్లా. దాని పరిధిలోని జశ్రత్ పూర్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఆరో తేదీన ఒక మహిళ డెడ్ బాడీని గుర్తించారు.

Update: 2024-10-13 04:32 GMT

ట్విస్టుల మీద ట్విస్టులు. సినిమాల్లోనో లేదంటే ఇటీవల పాపులర్ అయిన వెబ్ సిరీస్ మాదిరి రియల్ క్రైం స్టోరీ. వెబ్ సిరీస్ లో ఎలా అయితే ప్రతి ఎపిసోడ్ ఒక ట్విస్టుతో నడుస్తుందో.. అచ్చం అలానే సాగే ఈ నిజజీవిత నేర కథ షాక్ కు గురి చేస్తుంది. అసలు నిజ జీవితంలో ఇలా జరగటం సాధ్యమేనా? అనుకోవచ్చు. కానీ.. సరిగ్గాఅలానే జరిగిన ఈ వైనం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తన మైనర్ కూతురు ప్రేమలో పడిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఒక తల్లి.. పరువు కోసం తన కూతుర్ని చంపేయాలంటూ ఒకరికి సుపారీ ఇచ్చింది. అక్కడితో మొదలైన ట్విస్టులు.. చివరకు ఆమె హతమయ్యే వరకు వెళ్లింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని ‘‘ఎటా’’ అనేది ఒక జిల్లా. దాని పరిధిలోని జశ్రత్ పూర్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఆరో తేదీన ఒక మహిళ డెడ్ బాడీని గుర్తించారు. ఆమెను 35 ఏళ్ల అల్కాగా గుర్తించారు. అల్లాపూర్ నివాసి ఆయిన ఆమె హత్యకు గురి కావటం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమైంది. చివరకు పోలీసుల విచారణలో ఆమెను హత్య చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా నిందితులు చెప్పిన విషయాల్ని విన్న పోలీసులకు సైతం కరెంట్ షాక్ తగిలినట్లుగా తగిలాయి. తన మైనర్ కూతురు (17 ఏళ్లు) ఒక వ్యక్తితో ప్రేమలో పడిన విషయాన్ని అల్కా గుర్తించింది. దీంతో సీరియస్ అయిన ఆమె.. తన కూతుర్ని ఫారూఖాబాద్ లోని తన పుట్టింటికి పంపింది.

అయితే.. ఊరి నుంచి దూరంగా ఉంచినా.. తన కూతురిలో ఎలాంటి మార్పు లేని పరిస్థితి. ఫోన్ లోనే ప్రేమికుడితో గంటల గంటల తరబడి మాట్లాడున్న విషయాన్ని పుట్టింటివారు అల్కాకు చెప్పి.. ఆమెను తమ ఇంటి నుంచి తీసుకెళ్లిపోవాలని పేర్కొన్నారు. కూతురు తీరుతో తన పరువు పోతుందని రగిలిపోయిన అల్క.. తన మైనర్ కూతుర్ని చంపేందుకు ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చింది. అతడి పేరు సుభాష్ సింగ్. 38 ఏళ్లు. తన కూతుర్ని చంపేస్తే రూ.50వేలు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది.

అయితే.. అల్కాకు తెలీని విషయం ఏమంటే.. తాను తన కూతుర్ని చంపేందుకు సుపారీ ఇచ్చిన వ్యక్తితోనే ఆమె ప్రేమలో పడిన విషయం తెలీదు. దీంతో.. సుభాష్ డీల్ కు ఓకే చేసి.. నేరుగా అల్కా కూతురు వద్దకు వెళ్లి.. ఆమె తల్లి తనతో చేసుకున్న డీల్ గురించి చెప్పారు. దీంతో.. షాక్ తిన్న అల్కా కూతురు.. తన తల్లి చేసిన పనికి ఆగ్రహానని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుభాష్ ఆమెకు ఒక దరిద్రపుగొట్టు ప్లాన్ చెప్పాడు.

అల్కాను అడ్డు తొలగించుకుంటే.. తామిద్దరం హాయిగా పెళ్లి చేసుకొని ఉండొచ్చంటూ నమ్మించాడు. రివర్సు ప్లాన్ తో మొత్తం సెట్ అయిపోతుందని భావించాడు. అదే విషయాన్ని అల్కా కూతురు నమ్మేలా చేశాడు. అనుకున్నట్లే అల్కాను చంపేశారు. పోలీసులు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో వెంటనే దొరికిపోయారు. తాము చేసిన హత్య గురించి పూసకుచ్చినట్లుగా వివరించారు. కూతుర్ని చంపేందుకు సుపారీ ఇచ్చి.. తానే హతమైన ఈ ఉదంతం పోలీసులకు సైతం షాకిచ్చేలా మారింది. స్థానికంగా ఈ ఉదంతం ఒక సంచలనమైంది.

Tags:    

Similar News