ఇప్పటివరకూ 1815 కిలోలు... బంగారాన్ని వెదజల్లుతున్న అగ్ని పర్వతం!

అవును... అంటార్కిటికాలోని మౌంట్ ఎరె బస్ అనే అగ్నిపర్వతం ప్రతీరోజూ బంగారాన్ని వెదజల్లుతోంది.

Update: 2024-04-19 08:26 GMT

ప్రపంచంలో బంగారం ఎంత విలువైనదనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ప్రపంచంలో ప్రతీరోజూ విలువైన బంగారం దానికదే ఉత్పత్తి అయ్యే ప్రదేశం కూడా ఉంది. కానీ... విషాదకరమైన విషయం ఏమిటంటే..? ఆ ప్రదేశాన్ని చేరుకోలేకపోవడం! అవును.. మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటికాలో ఓ అగ్నిపర్వతం ప్రతిరోజూ విలువైన బంగారపు ధూళిని వెదజల్లుతుంది.

అవును... అంటార్కిటికాలోని మౌంట్ ఎరె బస్ అనే అగ్నిపర్వతం ప్రతీరోజూ బంగారాన్ని వెదజల్లుతోంది. ఐ.ఎఫ్.ఎల్. సైన్స్ అధ్యయనం ప్రకారం... ఈ ఖండంలోని అత్యంత భయంకరమైన, ఎత్తైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ ఎరె బస్.. ప్రతిరోజూ సుమారు 80 గ్రాముల వరకూ బంగారాన్ని విడుదల చేస్తుందని, దీని విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని నివేదిక సూచిస్తుంది.

"బంగారు ధూళి"గా సూచించబడే ఈ బంగారు కణాలు 20 మైక్రోమీటర్లకు మించి ఎక్కువ పరిమాణంలో ఉండవని.. ఇదే సమయంలో ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిసర గాలిలో కూడా బంగారం జాడలు కనుగొనబడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు! అయితే... ఈ ప్రాంతం భూమిపై దక్షిణాన ఉన్న అగ్నిపర్వత బిలం నుండి 621 మైళ్ల దూరంలో ఉన్నందున విలువైన బంగారాన్ని సేకరించడం సాధ్యం కాదుని చెబుతున్నారు.

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎర్త్ అబ్జర్వేటరీ ప్రకారం... ఇక్కడ మంచుతో నిండిన అగ్నిపర్వతం నుండి గ్యాస్ నిరంతరం బయటకు వస్తూనే ఉందని, ఇందులో బంగారంతో పాటు అనేక ఇతర విలువైన లోహాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో... న్యూయార్క్‌ లోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ కానర్ బేకన్ మాట్లాడుతూ.. 1972 నుండి ఈ ఎరే బస్ అగ్నిపర్వతం నిరంతరం విస్ఫోటనం చెందుతోందని అన్నారు!

ఈ క్రమంలో 1972 నుంచి ఇప్పటివరకూ ఈ అగ్నిపర్వతం నుంచి 1518 కిలోల బంగారు రేణువులు దూళి రూపంలో వాతావరణంలో చేరినట్లు చెబుతున్నారు. ఈ వాల్కెనో కింద బంగారు గని కూడా ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారట.

Tags:    

Similar News