తెగించిన హూతీలు.. అమెరికా మూడో కంటికి గురి
అయితే, తాజాగా అమెరికాకు సూపర్ డ్రోన్ గా పేర్కొనే ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను హూతీలు కూల్చేశారు. యెమెన్ కేంద్రంగా దాడులు చేస్తున్నారు హూతీలు.
దాని విలువ లక్ష రెండు లక్షలు కాదు.. రూ.250 కోట్లు.. భూమికి చాలా పైన ఎగిరే సామర్థ్యం దాని సొంతం.. కానీ, విమానం కాదు.. ఒక రోజంతా గాల్లోనే ఉండగలదు.. కానీ, ఫైటర్ జెట్ కాదు.. ఒకరకంగా చెప్పాలంటే ఇది మూడో కన్నులాంటింది అనుకోవాలి. ఇంతటి ఘనతలు, ప్రత్యేకతలు ఉన్నది ఏమిటా అనుకుంటున్నారా? ఇంతకూ ఎవరి దగ్గర ఉన్నది అనుకుంటున్నారు? ఇంకెవరి దగ్గర.. ప్రపంచానికే పెదన్న దగ్గర. అలాంటి దానిని కూల్చివేసింది ఉగ్రవాద మూక.
ఇజ్రాయెల్-హమాస్య మధ్యలో దాదాపు 11 నెలల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో యెమెన్ కు చెందిన హూతీల ప్రస్తావన తరచూ వచ్చింది. వీరి యుద్ధంలో నేరుగా పాల్గొనకున్నా.. ఎర్ర సముద్రంలో సరకు రవాణా వాహనాలను హైజాక్ చేస్తూ కలకలం రేపారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అయితే, తాజాగా అమెరికాకు సూపర్ డ్రోన్ గా పేర్కొనే ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను హూతీలు కూల్చేశారు. యెమెన్ కేంద్రంగా దాడులు చేస్తున్నారు హూతీలు. యెమెన్ లో6ని మారిబ్ గవర్నరేట్ లో తాజాగా వీరు అమెరికా డ్రోన్ ను పడగొట్టారు. కాగా, తమ నియంత్రణలోని భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినందుకే ఈ చర్యకు దిగామని హూతీలు ప్రకటించారు.
ఏమిటీ ఎంక్యూ-9 డ్రోన్ డ్రోన్లందు ఎంక్యూ-9 డ్రోన్ వేరయా.. అంటారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది సూపర్ డ్రోన్. 24 గంటల పాటు సుమారు 50 వేల అడుగుల ఎత్తులో ఎగరడమే దీనికి కారణం. అత్యంత కీలక సమాచారాన్ని సేకరించే సామర్థ్యం దీని సొంతం. అందుకే విలువ కూడా అధికమే. ఏకంగా 30 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ.251 కోట్లకు పైగా) అని లెక్క. ఇక హూతీలు యెమెన్ తిరుగుబాటుదారులు. పదేళ్ల కిందటే యెమెన్ రాజధాని సనాను తమ వశం చేసుకున్నారు. నాటి నుంచి అమెరికా డ్రోన్లను కూల్చడమే వీరి పని. తాజాగా మారిబ్ గవర్నరేట్ లో తిరుగుతూ రహస్య సమాచారం సేకరిస్తోందని ఎంక్యూ-9ను పడగొట్టారు.
ఇరాన్ మద్దతుతో..
హూతీలకు ఇరాన్ మద్దతు ఉంది. పాలస్తీనా, యెమెన్ రక్షణ తమ ధ్యేయంగా చెబుతుంటారు. ఇజ్రాయెల్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఇరాన్ కు హూతీలు తోక సాయం చేస్తున్నారు. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడికి పాల్పడ్డారు.