ముద్రగడతో టచ్ లోకి బీజేపీ...!?
మంచి రోజు చూసుకుని ఇక ముద్రగడ వైసీపీలో చేరడం లాంచనం అని అంతా అనుకుంటున్న వేళ ఇపుడు మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే ముద్రగడ బీజేపీలోకి వెళ్తారు అని.
అమాంతం కాపు నేత ముద్రగడ పద్మనాభానికి డిమాండ్ పెరిగిపోయింది. నేను ఒక ఇనుమ ముక్కను, నాకు ఏ గ్లామర్ లేదు అందుకే పట్టించుకోలేదు కదూ పవన్ అని వారం క్రితం ఘాటు లేఖ ఒకటి బహిరంగంగా రాసేనాటికి ముద్రగడ ఫుల్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఇక ఈసారి రాజకీయంగా హడావుడి చేసేది ఏమీ లేదని అనుకున్నారు.
అయితే అక్కడ నుంచి పొలిటికల్ స్పెక్యులేషన్స్ ప్రారంభం అయ్యాయి. ముద్రగడ వైసీపీ వైపు చూస్తున్నారు అని. ఆయన కుమారుడితో వైసీపీ టచ్ లోకి వెళ్ళిందని వార్తలు వచ్చాయి. దాని మీద ముద్రగడ కొడుకుతో మాట్లాడుతూ వైసీపీ పెద్దలకు ఇంట్రెస్ట్ ఉంటే తన ఇంటికే వచ్చి మాట్లాడుతారు అని చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగింది.
అలా ముద్రగడ ఇంటికి ఎంపీ మిధున్ రెడ్డి ఇతర కీలక నేతలు వచ్చారు. మంతనాలు జరిపారు. మంచి రోజు చూసుకుని ఇక ముద్రగడ వైసీపీలో చేరడం లాంచనం అని అంతా అనుకుంటున్న వేళ ఇపుడు మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే ముద్రగడ బీజేపీలోకి వెళ్తారు అని. బీజేపీ నేతలు కూడా ముద్రగడకి టచ్ లోకి వచ్చారని.
ఈ ముఖ్యమైన వార్తను చెప్పింది ఎవరో కాదు జనసేన కీలక నాయకుడు విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ. ఆయన ఒక ప్రముఖ చానల్ డిబేట్ లో మాట్లాడుతూ నేను చెబుతున్నది నిజం, ముద్రగడ ఎక్కడికీ వెళ్లడం లేదు, వైసీపీలో ఆయన అసలు చేరది ఉండదు, అంతా ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.
ముద్రగడ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉంటారు ని కొత్త వార్తను చెప్ప్పారు. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు అని మరో సీక్రెట్ ని కూడా ఆయన విప్పి చెప్పారు. ఇది నిజంగా బిగ్ ట్విస్ట్ కింద లెక్కగానే చూడాలి. ముద్రగడ వైసీపీ ని గురువారం రోజంతా మీడియాలో పాకిపోయింది. అసలు ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదు.
కానీ బొలిశెట్టి మాత్రం నమ్మకంగా చెబుతున్నారు. ముద్రగడ ఎక్కడికీ వెళ్ళరు, కూటమితోనే ఉంటారు అని. ముద్రగడని బీజేపీ పెద్దలు తమ పార్టీలోకి పిలుస్తున్నారా అంటే రాజకీయంగా చూస్తే ఏమైనా జరగవచ్చు. ముద్రగడ గతంలో అంటే పాతికేళ్ల క్రితం బీజేపీలో చేరిన వారే.
ఆయనకు బీజేపీలో కూడా మిత్రులు ఉన్నారు. ఇక బీజేపీ కూటమిలోకి వస్తే కాకినాడ ఎంపీ సీటు కోరుకుంటుందని అంటున్నారు. అది ముద్రగడకు ఇచ్చి తమ వైపు తిప్పుకుంటారు అని టాక్ నడుస్తోంది. ఇక వైసీపీ నేతలతో ముద్రగడ మాట్లాడినపుడు తాను పోటీ చేసే సీటులో గెలుపు అవకాశాలు కూడా చూసుకోవాలని సూచించినట్లుగా ప్రచారం సాగింది.
దీనిని బట్టి చూస్తే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధపడుతున్నారని ఈసారి కచ్చితంగా గెలిచి చట్ట సభలకు వెళ్లాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఆయన బీజేపీ లోకి వెళ్తే కూటమి ఖాతాలో కాకినాడ ఎంపీ సీటు పడుతుంది అని అంటున్నారు. ఇంతకీ ముద్రగడ వైసీపీలోకా లేక బీజేపీలోకా అన్నది ఇపుడు బిగ్ క్వశ్చన్ గా ఉంది.