ఎగబాకుతున్న ఎలాన్ మస్క్.. అంబానీ, అదానీ తగ్గింది ఇందుకేనా..?

బ్లూమ్ బెర్గ్ రిచ్చేస్ట్ పీపుల్ జాబితాలో వారితో పాటు మరో ఐదుగురు వ్యాపారవేత్తలు టాప్ 100లో ఉన్నప్పటికీ 100 బిలియన్స్ డాలర్ల జాబితాలో చేరలేదు!

Update: 2024-12-16 12:30 GMT

ప్రపంచంలోని కుబేరుల జాబితాలో 100 బిలియన్ డాలర్స్ క్లబ్బులో స్థానం దక్కించుకున్న ఇద్దరే ఇద్దరు బడా వ్యాపారవేత్తలు అయిన భారతీయులు.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అనే సంగతి తెలిసిందే. బ్లూమ్ బెర్గ్ రిచ్చేస్ట్ పీపుల్ జాబితాలో వారితో పాటు మరో ఐదుగురు వ్యాపారవేత్తలు టాప్ 100లో ఉన్నప్పటికీ 100 బిలియన్స్ డాలర్ల జాబితాలో చేరలేదు!

అయితే వీరిద్దరూ మాత్రం గత కొంతకాలంగా 100 బిలియన్ డాలర్స్ క్లబ్బులో స్థానం సంపాదించుకున్నారు. ఇందులో భాగంగా... ఈ ఏడాదిలోనే ఓ సమయంలో ముఖేష్ అంబానీ 120 బిలియన్ డాలర్స్ నికర సంపదతో నిలవగా.. ఆయనను దాటి గౌతమ్ అదానీ 122 బిలియన్ డాలర్స్ తో నిలిచారు. అయితే తాజాగా ఇద్దరూ ఆ జాబితా నుంచి అవుట్ అయ్యారు!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద ప్రపంచ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయాలు రచిస్తూ ముందుకు దూసుకుపోతుండగా.. భారత్ లోని టాప్ 2 రిచ్చేస్ట్ పీపుల్ అయిన అంబానీ, అదానీల నికర సంపద విలువ మాత్రం తగ్గిపోవడం గమనార్హం. దీంతో.. దీనికి గల కారణలపై చర్చ మొదలైంది.

వాస్తవానికి ఈ ఏడాది జూన్ 3వ తేదీ సమయంలో బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ ఆస్తుల నికర విలువ 122 బిలియన్ డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీపై తీవ్ర అభియోగాలు మోపాయి. దీంతో... ఆ ప్రభావం అదానీ సంస్థలపై భారీగా పడిందై, ఇది దాని ఫలితమే అని అంటున్నారు.

దీంతో.. ప్రస్తుతం 100 బిలియన్ డాలర్స్ క్లబ్ నుంచి డ్రాప్ అయిన గౌతమ్ అదానీ నికర విలువ 82.1 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

మరోపక్క... ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో 120 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నారు ముఖేష్ అంబానీ. తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంతోషంగా సుమారు 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని అంటున్నారు. అయితే.. ఫ్యుయెల్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన ఆదాయంలో కోతల ఫలితంగా ఈ దెబ్బ తగిలిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీతో పాటు 100 బిలియన్ డాలర్స్ క్లబ్ నుంచి డ్రాప్ అయ్యారు ముకేష్ అంబానీ. ప్రస్తుతం ఈయన నికర విలువ 96.7 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో.. ప్రస్తుతం 100 బిలియన్ డాలర్స్ క్లబ్ లో భారతీయులు కనిపించడం లేదు!! కాగా... తాజా లెక్కల ప్రకారం... మస్క్ సంపద 455 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.

టాప్ 100 ధనవంతుల జాబితాలోని భారతీయులు వీరే!:

17. ముకేష్ అంబానీ - $96.7 బిలియన్స్

19. గౌతమ్ అదానీ - $82.1 బిలియన్స్

51. సావిత్రి జిందాల్ - $34.8 బిలియన్స్

56. అజీమ్ ప్రేమ్ జీ - $31.9 బిలియన్స్

64. దిలీప్ శాంఘ్వీ - $28.7 బిలియన్స్

76. సునీల్ మిట్టల్ - $25.7 బిలియన్స్

100. కుమార్ బిర్లా - 20.9 బిలియన్స్

Tags:    

Similar News