కొత్త తరహా డేటింగ్ స్కామ్... తెలిస్తే షాకే!

ఈ నేపథ్యంలో తాజాగా కొత్త తరహా డేటింగ్ స్కామ్ తెరపైకి వచ్చింది.

Update: 2024-08-24 23:30 GMT

కాదేదీ మోసానికి అనర్హం అన్నట్లుగా రోజులు మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ మోసపోయేవారి సంగతి కాసేపు పక్కనపెడితే... మోసం చేసే వారికి మాత్రం అవతలివారి ఎమోషన్స్ అండ్ వీక్ నెస్ మాత్రమే పెట్టుబడి. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త తరహా డేటింగ్ స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా "కూరాళ్లూ జాగ్రత్త" అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

అవును... ఇటీవల కాలంలో అన్నింటికీ యాప్స్ వచ్చేశాయి. ఇందులో భాగంగా... ప్రధానంగా డేటింగ్ యాప్ లు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఈ డేటింగ్ యాప్ లను ఆసరాగా చేసుకుని దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ పెద్ద స్కామే జరుగుతుందనే విషయం తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ కారణంగా పలువురు పురుషుల జేబులు గుల్ల అవుతున్నాయంట.

ఈ స్కామ్ వ్యవహారాన్ని ముంబై కి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వజ్ ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ డేటింగ్ యాప్ ద్వారా అంధేరి వెస్ట్ లోని ది గాడ్ ఫాధర్ క్లబ్ ఈ తరహా మోసానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ యాప్ ద్వారా ప్రతీ రోజూ సుమారు 10 నుంచి 12 మంది బాధితులుగా మారుతున్నారని తెలుస్తోంది. బాధితులుగా మారిన వారు భారీ ఎత్తున పోగుట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలను అబ్బాయిలకు కనెక్ట్ చేస్తారు. వారు తమ మాటల ద్వారా అబ్బాయిలను ముగ్గులోకి దించుతారు. అలా వారిని మాటల్లో పెట్టి ఆ హోటల్, ఈ పబ్, ఆ క్లబ్ అంటూ పెద్ద పెద్ద హోటళ్లకు అబ్బాయిలను తీసుకువెళ్తారు. ఈ క్రమంలో తమకు నచ్చిన వాటిని ముందుగా ఆర్డర్ చేస్తారు. ఈ క్రమంలో సుభ్రంగా తినేసి.. వాష్ రూమ్ అనో, ఇప్పుడే వస్తామనో చెప్పి హుడాయిస్తారు.

అసలు విషయం తెలియని అబాయిలు వేయి కల్లతో ఆ అమ్మాయి కోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చుంటారు. కట్ చేస్తే.. చివరికి బిల్లు తెమ్మని వెయిటర్ కు చెబితే... వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి సదరు కుర్రాడి గుండే గుబేలుమంటుంది. ఈ క్రమంలో తాము మోసపోయామని తెలుసుకునేలోపు జేబు ఖాళీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో బాధిత యువకులు కొంతమంది పోలీసులను ఆశ్రయిస్తారు.

ఈ క్రమంలో ఓ వైపు కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది.. మరో వైపు ఈ డేటింగ్ యాప్ ద్వారా కొత్త కొత్త బాధితులు ప్రతీ రోజూ బలవుతూనే ఉంటారు. అయితే.. ఈ యాప్ ల ద్వారా కనెక్టివిటీ అయ్యే అందమైన మహిళలకు 20 నుంచి 30 శాతం మేర కమిషన్ అందుతుందని తెలుస్తోంది. ఈ సమయంలో... బాధిత కుర్రాళ్లు లబో దిబోమంటున్నారు.

Tags:    

Similar News