లోకేష్ మీద పోటీ చేసిన వైసీపీ కుటుంబం టీడీపీలోకి ?
ఇక కాంగ్రెస్ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంత రావు ఇపుడు తన విధేయతను మార్చుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో అత్యంత ఆసక్తి కలిగించిన సీటు ఏది అంటే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేసినది అని చెప్పాలి. ఈ సీటులో ఫైట్ హాట్ హాట్ గా ఉంటుందని అనుకున్నారు. పోలింగ్ దాకా అలాగే సాగింది. కానీ తీరా రిజల్ట్ చూస్తే పూర్తి ఏకపక్షంగా వచ్చింది. ఏకంగా తొంబై వేల ఓట్ల భారీ మెజారిటీతో నారా లోకేష్ ఈ సీటుని గెలుచుకున్నారు.
దాంతో ఆయన మీద పోటీకి దిగిన వైసీపీ అభ్యర్ధిని మురుగుడు లావణ్యకు తొలి ఎన్నికే షాక్ కొట్టింది. ఆమె మామ మురుగుడు హనుమంత రావు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. తల్లి కమలకుమారి ఎమ్మెల్యేగా చేశారు. అయినా సరే లావణ్యకు కలసిరాలేదు. అంతే కాదు 70 వేల దాకా ఉన్న చేనేత కులస్తులు కూడా అండగా నిలవలేదు.
మొత్తం మీద చూస్తే ఈ ఎన్నిక మురుగుడు ఫ్యామిలీకి చేదుని మిగిల్చింది. ఇక కాంగ్రెస్ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంత రావు ఇపుడు తన విధేయతను మార్చుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
ఆయన తెలుగుదేశం ప్రభుత్వం పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షతను కొనియాడడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతే కాకుండా ఇటీవల జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అధికారిక సమావేశంలో నారా లోకేష్ ని కూడా ఆయన పొగడటం కూడా కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది అని అంటున్నారు.
ఆయన పదవీకాలం ఎమ్మెల్సీగా ఇంకా ఉంది. అదే సమయంలో ఎమ్మెల్సీలు టీడీపీకి శాసనమండలిలో చాలా మంది కావాలి. అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి రాజకీయం బాగుంటుంది అని సీనియర్ అయిన మురుగుడు భావించారు అని అంటున్నారు. దాంతోనే ఆయన సరైన సమయం చూసి టీడీపీని కీర్తించడం మొదలెట్టారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే మంగళగిరి నుంచి తమ కుటుంబం మరోసారి 2029 నాటికి పోటీ చేయాలన్నది ఆయన కోరిక అంటున్నారు. నారా లోకేష్ ఈసారి మంగళగిరిని పంతం కోసం ఎంచుకున్నా 2029 నాటికి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయకపోవచ్చు అన్నది కూడా ఉంది. చంద్రబాబు పొలిటికల్ గా రిటైర్ అయితే కుప్పం సీటుకు లోకేష్ షిఫ్ట్ కావచ్చు అని కూడా అంటున్నారు.
అలా మంగళగిరి ఖాళీ అయితే ఆ సీటుని తమ కుటుంబం నుంచి పోటీకి తీసుకోవచ్చు అని ఫ్యూచర్ ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. అదే వైసీపీలో ఉంటే మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే సీటు కన్ఫర్మ్ చేస్తారు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి మురుగుడు చాలా ఈక్వేషన్స్ తోనే టీడీపీని పొగుడుతున్నారు అని అంటున్నారు. ఆయన ఆలోచనలు నిజమైనా ఈ పుకార్లు వాస్తవం అని తేలినా వైసీపీకి భారీ షాక్ తప్పకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.