మూసీ విజన్-2050: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం ప్రకటించారు. థేమ్స్ నదిలా హైదరాబా ద్‌లోని మూసీ నదిని డెవలప్ చేయాలని ఆయన నిర్ణయించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం ప్రకటించారు. థేమ్స్ నదిలా హైదరాబా ద్‌లోని మూసీ నదిని డెవలప్ చేయాలని ఆయన నిర్ణయించారు. ఇదే విషయాన్ని తాజాగా ఆయన లండన్ లో ప్రకటించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం బ్రిటన్ రాజధాని లండన్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా లండన్ కే పేరు తెచ్చిన థేమ్స్ నదిని ఆయన పరిశీలించారు. ఈ బృందంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా ఉన్నారు.
థేమ్స్ నది ఒకప్పుడు.. మూసీ కన్నా దారుణంగా ఉండేది. అయితే.. బ్రిటన్ ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. దీనిని విస్తరించి.. అభివృద్ధి చేసి, నేడు పర్యాటక ప్రాంతంగా కూడా మార్చింది. దీని నుంచి విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా విశేషాలను తెలుసుకున్న సీఎం రేవంత్.. హైదరాబాద్‌లో మురికి కూపాన్ని తలపిస్తున్న మూసీ నదిని కూడా థేమ్స్ నదిలా మార్చాలని నిర్ణయించినట్టు థేమ్స్ నది నిర్వహణ బృందానికి, ఇంజనీర్లకు వివరించారు.
దీనికి సంబంధించి తమకు సహకరించాలని కూడా బ్రిటన్ బృందానికి సీఎం విన్నవించారు. ఈ సందర్భంగా థేమ్స్ నది చరిత్ర, అభివృద్ది, దీనికి అయిన ఖర్చు, ఇప్పుడు వస్తున్న ఆదాయం, పర్యాటకం ఎలా పెరిగింది? అనే వివరాలను థేమ్స్ నదీ బోర్డు యాజమాన్యం వివరించింది. ఈ వివరాలతో సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. మూసీ నది బాధ్యతలను అప్పగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నా రు.
మూసీ నది రూపు రేఖలు మారితే దీనికి అనుబంధంగా ఉన్న చెరువులు కళకళలాడతాయని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇదేసమయంలో మూసీ విజన్-2050ని ఆయన థేమ్స్ బోర్డు అధికారులకు ఆయన వివరించారు. దీనికి సహకరించాలని ఆయన కోరగా వారు కూడా అంగీకరించారు. త్వరలోనే హైదరాబాద్ వస్తామని.. మూసీ నదిని పరిశీలించి.. చర్చిస్తామని వారు హామీ ఇచ్చారు.