ఎలాన్ మస్క్ కోసం పని చేస్తారా?... అర్హతలు ఇవే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-16 06:33 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనవరిలో ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపు తన టీమ్ ను ఏర్పాటు చేసుకునే విషయంలో కీలక కసరత్తులు చేస్తున్నారు. ఈ సమయంలో మస్క్, వివేక్ కోసం పని చేసే వారి విషయంపై కీలక అప్ డేట్ వచ్చింది.

అవును... అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిల పాత్ర అత్యంత కీలకం అని అంటున్నారు. ఈ సమయంలో వీరిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా.. వీరిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీవోజీఈ / డోజ్) సారథులుగా నియమించిన సంగతి తెలిసిందే!

ఈ నేపథ్యంలో ఈ శాఖ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... వివేక్ రామస్వామి, ఎలన్ మస్క్ ల కోసం పనిచేసేవారికి కావాల్సిన అర్హతలను పేర్కొంటూ.. రెజ్యూమ్ లను ఎక్స్ లోని తమ అఫీషియల్ అకౌంట్ కు పంపించాలని ఆ శాఖ కోరింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

ఈ క్రమంలో... మస్క్, వివేక్ కోసం పనిచేయాలనుకునేవారు వారానికి 80 గంటలు పనిచేసేవారు, హై ఐక్యూ కలిగినవారు అయ్యి ఉండాలని అంటున్నారు. ఈ మేరకు... వీరి కోసం 80 గంటలు పనిచేసేవారు, హై ఐక్యూతో పనిచేసేవారు ఈ శాఖకు కావాలంటూ పోస్ట్ చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

అయితే... ఎక్స్ ప్రీమియం అకౌంట్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను మస్క్, వివేక్ పరిశీలిస్తారని వెల్లడించారు. రెజ్యూమ్ లను ఎక్స్ లో డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరారు. ఇక... ఈ అకౌంట్ కు ఇప్పటికే సుమారు 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకొంది.

కాగా... ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులే లక్ష్యంగా "డోజ్" ప్రాజెక్ట్ రూపొందించామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా.. అమెరికా ప్రభుత్వ దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తోందని అంటున్నారు. దీంతో... ఈ శాఖను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లేలా వ్యవస్థలో మస్క్, వివేక్ లు మార్పు తెస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Tags:    

Similar News