మైల‌వ‌రంలో డిష్యుం.. డిష్యుం.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ!

ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ విగ్రహం కనబడకుండా వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. దీనిని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు.

Update: 2023-10-18 09:01 GMT

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు మ‌రో సారి వేడెక్కా యి. మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవినేని ఉమాకు అత్యంత కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో త‌ర‌చుగా ఇక్క‌డ వివాదాలు రోడ్డెక్కు తూనే ఉన్నాయి. తాజాగా మైల‌వ‌రం సెంట‌ర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌.. ఎమ్మెల్యే వ‌సంత‌కు అనుకూలంగా కొంద‌రు బ్యాన‌ర్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నించారు.

అయితే.. ఎన్టీఆర్ విగ్ర‌హం క‌నిపించ‌ద‌ని పేర్కొంటూ.. బ్యాన‌ర్‌ను వేరే చోట క‌ట్టాల‌ని టీడీపీ నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టారు. ఇది చిలికి చిలికి గాలివాన‌గా మారింది.

ఏం జ‌రిగిందంటే..

''రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి'' అనే కార్యక్రమం మైలవరంలో జ‌రిగింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ విగ్రహం కనబడకుండా వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. దీనిని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వివాదం ఏర్ప‌డింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అండ దండలతో వైసీపీ శ్రేణులు మైలవరంలో అరాచకాలు సృష్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మ‌రోవైపు.. ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మైలవరం, తిరువూరు సర్కిల్స్ పరిధి పోలీస్ సిబ్బందితో పాటు వందలాది సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో మైలవరం పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News