‘ఎం-నౌ’.. రాబోయే రోజుల్లో ఈ పేరు మస్తు పాపులర్ కానుంది!
అయితే.. ఈ రంగంలోకి కొత్తగా ఎంట్రీ ఇస్తోంది ఫ్యాషన్ .. లైఫ్ స్టైల్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ మింత్రా.
ఇంట్లో అవసరమైన వస్తువ ఏదైనా సరే.. మొబైల్ లో ఆర్డర్ పెట్టేసిన అరగంటలో ఇంట్లోకి వచ్చే సర్వీసులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ రంగంలోకి కొత్తగా ఎంట్రీ ఇస్తోంది ఫ్యాషన్ .. లైఫ్ స్టైల్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ మింత్రా. దీని తాజా ప్రాజెక్టు పేరు ‘ఎం-నౌ’. ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లో కోరుకున్న ఉత్పత్తులను డెలివరీ చేయటమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఇలాంటి సేవలు అందించే సంస్థలు ఉన్నప్పటికీ.. మిగిలిన వాటికి భిన్నంగా వ్యవహరించటమే తమ స్పెషల్ గా చెబుతున్నారు.
ప్రస్తుతం బెంగళూరులో ఈ సంస్థ తన సేవల్ని అందిస్తోంది. పైలెట్ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ కావటం.. సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో.. తమ వ్యవస్థను మరింత విస్తరించేలా మింత్రా ప్లాన్ చేస్తోంది. రానున్న కొద్ది నెలల్లో దేశంలోని మెట్రో.. నాన్ మెట్రో నగరాల్లో విస్తరించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మింత్రా చెబుతోంది. మిగిలిన వాటికి.. దీనికి మధ్య తేడా ఏమంటే.. ఎవరైనా ఏ వస్తువైన ఆర్డర్ పెట్టి.. దాన్ని వెనక్కి ఇచ్చేసే సదుపాయం ఉండదు. కానీ.. ఎం-నౌ లో మాత్రం అలాంటి ఫీచర్ ను కల్పిస్తున్నారు.
ప్రస్తుతం 10వేల ఉత్పత్తులు డెలివరీకి అందుబాటులో ఉన్నాయని.. రానున్న కొద్ది రోజుల్లోనే లక్ష ఉత్పత్తులను డెలివరీ చేసేలా విస్తరించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కిక్ ఈకామర్స్ రంగంలోకి పలు సంస్థలు వచ్చినప్పటికీ.. బ్యూటీ.. ఫ్యాషన్ విభాగం నుంచి వస్తున్న మొదటి సంస్థ మింత్రాగా చెప్పొచ్చు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ రంగంలో దేశంలో కీలక పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయం కలుగక మానదు.