ఫర్ బెటర్ సొసైటీ... ప్రపంచ దేశాలకు నాగబాబు ఆసక్తికర సూచన!
ఇలాంటి నిర్ణయాన్ని అన్ని దేశాలు ఇంప్లిమెంట్ చేస్తే.. ఉత్తమ సమాజాన్ని, ఉత్తమ దేశాన్ని.. ఫలితంగా ఉత్తమ ప్రపంచాన్ని చూస్తామని అభిప్రాయపడ్డారు కొణిదెల నాగబాబు!
ప్రస్తుతం చదువుకుంటున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఇందులో మంచి కంటే చాలా రెట్లు ఎక్కువగా చెడు ప్రభావమే కనిపిస్తొందనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా జనసేన నేత కొణిదెల నాగబాబు స్పందించారు.
అవును... ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఫిక్సయ్యింది. ఈ క్రమంలో... దీనికి సంబంధించిన బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. త్వరలో చట్టం తీసుకురాబోతోంది. దీనిపై నాగబాబు స్పందించారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చాలా మంది పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారని అంటున్న నేపథ్యంలో స్పందించిన నాగబాబు... 16 ఏళ్ల లోపు టీనేజర్స్ కి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని.. ఇది ఒక రకంగా బావితరాల బంగారు భవిష్యత్తుకి బాసటగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే నేటి పిల్లలు సోషల్ మీడియాలో ఎంతో ప్రభావితం అవుతూ.. బాల్యదశలోనే సోషల్ మీడియాలో చిక్కుకుంటూ.. చదువుని, భవిష్యత్తుని చేజేతులా చేజార్చుకుంటున్నారని నాగబాబు తెలిపారు. 'మొక్కై వంగనిది మానై ఒంగునా' అనే నానుడికి అద్ధం పడుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్ని దేశాలకూ ఆదర్శం అని అన్నారు.
ఇలాంటి నిర్ణయాన్ని అన్ని దేశాలు ఇంప్లిమెంట్ చేస్తే.. ఉత్తమ సమాజాన్ని, ఉత్తమ దేశాన్ని.. ఫలితంగా ఉత్తమ ప్రపంచాన్ని చూస్తామని అభిప్రాయపడ్డారు కొణిదెల నాగబాబు!
కాగా... 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని నిర్ణయించుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ప్రతినిధుల సభలో బిల్లుకు ఆమోదం తెలిపింది. సెనెట్ ఆమోదం తెలిపితే ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో.. ఇలాంటి చట్టం ప్రతీ దేశంలోనూ వస్తే ఉత్తమ ప్రపంచాన్ని చూస్తామని నాగబాబు అభిప్రాయపడ్డారు.