ముహూర్తం ఫిక్స్ : లోకేష్ డిప్యూటీ సీఎంగా నాగబాబు మంత్రిగా !

ఇక కూటమిలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఉగాది తరువాత మంచి ముహూర్తం చూసి లోకేష్ ని రెండవ ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నియమించనున్నారు.

Update: 2025-01-20 02:30 GMT

రాజకీయ మేధావిగా చంద్రబాబుని చెబుతారు. ఆయనలో అపర చాణక్యుడు మరో మారు తన పదును ఏంటో చూపించారు. కూటమి మరింత కాలం పదిలంగా నడిపించేలా చూసుకుంటూనే తన కుమారుడు నారా లోకేష్ నే రేపటి వారసుడు అని చాటి చెప్పేలా భారీ ప్లాన్ వేశారు అని అంటున్నారు.

ఆ ప్లాన్ చూస్తే ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అని అంటున్నారు. ఇక కూటమిలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఉగాది తరువాత మంచి ముహూర్తం చూసి లోకేష్ ని రెండవ ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నియమించనున్నారు.

అదే సమయంలో జనసేనకు కూడా ఒక గిఫ్ట్ గా నాగబాబుని మంత్రిని చేయనున్నారు. దాంతో జనసేన కూడా ఏమీ అనలేని పరిస్థితి అని అంటున్నారు. నిజానికి నాగబాబును మంత్రిగా తీసుకోవడం వెనక పవన్ ఆలోచనలు ఉన్నాయా లేక బాబు వ్యూహాలు ఉన్నాయా అంటే ఇపుడే దాని మీద కొంత విశ్లేషణ జరుగుతోంది. నాగబాబుకి రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించుకుంటే ఏ ఇబ్బంది వచ్చి ఉండేది కాదని అంటున్న వారూ ఉన్నారు

ఆయనను మంత్రిగా చేయడం అంటే పవన్ కూడా బంధు ప్రీతికి తలొగ్గారు అని కామెంట్స్ వచ్చే చాన్స్ ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే కొత్తగా వచ్చేది ఏదీ లేదు. ఆ పార్టీలో వారసత్వ పోకడలు సహజం. పైగా టీడీపీ అంటే అంతా ఓకే అనే పరిస్థితి. వారసత్వం విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎపుడూ అది తప్పు అని మాట్లాడింది కూడా లేదు.

కానీ జనసేన అధినేత అలా కాదు అవినీతి వారసత్వ రాజకీయాలు అంటూ తన ఫిలాసఫీ వల్లిస్తూ వచ్చారు. ఇపుడు సడెన్ గా నాగబాబుకు మంత్రి అంటే పవన్ ఈ విమర్శలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పవన్ కి ఇదే ఇబ్బంది అనుకుంటే నాగబాబుకు మంత్రి పదవి అన్న ఆఫర్ తో పాటుగా నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కల్పిస్తూ ప్రమాణం చేయించడం అంటే ఏమీ అసలు అనలేని పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు.

తండ్రీ కొడుకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగానా అని అసలు జనసేన నేతలు అనలేరని అంటున్నారు. ఎందుకంటే అదే కేబినెట్ లో తమ్ముడు డిప్యూటీ సీఎం నాగబాబు మంత్రిగా ఒప్పు అయినపుడు ఇది తప్పు ఎలా అవుతుంది అన్నది వెంటనే చర్చగా వస్తుంది. ఏ విధంగా చూసినా జనసేన స్మూత్ గానే ఈ విషయంలో ఉండాల్సి ఉంటుంది.

దాంతో కాగల కార్యం గంధర్వులు తీర్చుతన్నారు అన్నట్లుగా నాగబాబుకు మంత్రి పదవితో పాటే లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కుతుంది. దీని వల్ల కేబినెట్ లో జనసేన ప్రాధాన్యత పెరగకుండా లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చి పైకి లేపినట్లు అవుతుంది. అంతే కాదు ఉప ముఖ్యమంత్రి ఒకరు కాదు ఇద్దరు అన్నపుడు ఆటోమేటిక్ గా లోకేష్ కూడా హైలెట్ అవుతారు అని అంటున్నారు. టోటల్ గా చూస్తే భారీ స్కెచ్ తోనే టీడీపీ అధినాయకత్వం లోకేష్ కి డిప్యూటీ సీఎం సీటుని రెడీ చేసి పెడుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News