పెద్దిరెడ్డి తో మొదలెట్టి జగన్ దాకా !

జనసేన వ్యూహాత్మకంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మీటింగ్ పెట్టింది.

Update: 2025-02-03 04:07 GMT

జనసేన వ్యూహాత్మకంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మీటింగ్ పెట్టింది. జనంలోకి జనసేన పేరుతో నిర్వహించిన ఈ మీటింగులో మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వైసీపీని టోటల్ గా టార్గెట్ చేసారు. పెద్దిరెడ్డి తో మొదలెట్టి జగన్ దాకా అందరిపైనా విమర్శనాస్త్రాలు సంధించారు.

మాకు వైఎస్సార్ తోనే భయం లేదు ఈ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి మరో పిచ్చి రెడ్డి అంటే లెక్కనా అని నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎన్నికల సమయంలో రాయలసీమలో పెద్దగా పర్యటించలేదని దానికి కారణం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే పూర్తి సమయం వెచ్చించడం వల్లనే అన్నారు.

అయితే పెద్దిరెడ్డి అంటే భయం అని ఎవరూ అనుకోవద్దని ఆయన పాపాల చిట్టా తీయడానికే పుంగనూరు వచ్చామని నాగబాబు అనడం విశేషం. పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున భూములు కబ్జా చేశారని అటవీ శాఖ మంత్రిగా ఉంటూ ఆ సంపదను దోచుకున్న అడవి దొంగ అని సెన్సేషనల్ కామెంట్స్ నాగబాబు చేశారు.

పెద్దిరెడ్డి అసెంబ్లీకే రారు ఆయనకు ఎందుకు ఎమ్మెల్యే సీటు అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన 11 మంది జగన్ తో సహా అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చేందుకే భయం పుట్టుకుని వస్తోందని అన్నారు.

భూములను దోచుకున్న పెద్దిరెడ్డి ఆ భాగోతాలు బయటపడకుండా మదనపల్లెలో ఫైల్స్ ని తగులబెట్టించారు అని ఆయన విమర్శించారు. ఇలా తగలబడిన ఫైళ్ళలో చాల అవరకూ 22ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములే అని సీబీఐ అధికారులు చెప్పారని అన్నారు. పెద్దిరెడ్డి భూ భాగోతాలన్నింటినీ వెలికి తీస్తామని నాగబాబు స్పష్టం చేశారు.

గడచిన ఎనిమిది నెలలలో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చిందని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తోదని అన్నారు. వాటిని చూడలేని వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఇదిలా ఉంటే రాయలసీమను జనసేన టార్గెట్ చేసిందా అన్న చర్చ సాగుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిగ్ షాట్ గా వైసీపీలో ఉన్నారు. దాంతో ఆయననే ముందుగా కార్నర్ చేయడం ద్వారా వైసీపీ ముందర కాళ్ళకు బంధం వేయాలాని డిసైడ్ అయినట్లుగా ఉందని అంటున్నారు. వైసీపీకి బలం ఉన్న చోటనే దెబ్బ తీయాలన్నదే కూటమి నేతల వ్యూహంగా ఉంది అని అంటున్నారు.

ఇక కోస్తా జిల్లాలలో బలాన్ని జనసేన టీడీపీ పంచుకుంటునాయి. దాంతో జనసేన విస్తరించేందుకు సరైన రీజియన్ గా రాయలసీమను ఎంపిక చేసుకుందని అంటున్నారు. అందుకే జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా నాగబాబుని రంగంలోకి దింపారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహా సభలు సమావేశాలు చాలా జరుగుతాయని అంటున్నారు. మరి వైసీపీ దీనిని ఎలా ఎదుర్కొంటుంది ఏ విధంగా బదులిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News