కలియుగంలో పవన్ కల్యాణ్ పాత్రపై నాగబాబు పోస్ట్ వైరల్! /

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్న, జనసేన నేత కొణిదెల నాగబాబు తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆసక్తికర విషయం వెళ్లడించారు.

Update: 2024-09-25 04:54 GMT

ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. దేశవ్యాప్తంగానూ ఈ విషయంపై చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ సమయంలో జనసేన నేత నాగబాబు ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

అవును... ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సనాతన ధర్మం కోసం తాను నిలబడతానని.. అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమని.. హిందువులంతా కలిసి రావాలని బలంగా చెబుతున్నారు.

ఈ విధంగా తిరుమల లడ్డూ విషయంలో రియాక్ట్ అయిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ రియాక్షన్ పై పలువురు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్న, జనసేన నేత కొణిదెల నాగబాబు తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆసక్తికర విషయం వెళ్లడించారు.

ఇందులో భాగంగా.. హిందూ ధర్మాన్ని అమితంగా నమ్మె కళ్యాణ్ బాబు తనతో చాలా కాలం క్రితం ఓ మాట చెప్పారని నాగబాబు అన్నారు. ఇందులో భాగంగా... సత్య (కృత) యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదని.. అదే త్రేతాయుగంలో మూడు పాదాలతో ధర్మం, ఒక భాగంలో అధర్మం నడిచేదని పవన్ చెప్పారని అన్నారు.

ఇదే క్రమంలో... ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద, అధర్మం రెండు పాదాల మీద నడిచేది అని చెప్పిన పవన్... కలియుగం వచ్చేసరికి అధర్మం మూడు పాదాల మీద, ధర్మం కేవలం ఒక్కపాదం మీద మాత్రమే నడుస్తుందని చెప్పారని నాగబాబు తెలిపారు.

ఈ నేపథ్యంలో... కలియుగంలో ధర్మం ఒక్కపాదం మీద నడిచినా బలంగా నడవడానికి తన వంతు పాత్ర పోషిస్తానని, తన ప్రయత్నం సంపూర్ణంగా చేస్తానని పవన్ అన్నారని నాగబాబు తెలిపారు. "నా లీడర్ ధర్మం కోసం నిలబడతాడు అనడానికి ఉదాహరణ ఇవాళ మళ్లీ ప్రూఫ్ చేశాడు" అంటూ నాగబాబు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News