"డెలివరీ బాయ్ రేవంత్"... వైసీపీ నేతపై కేసు నమోదు!

పెద్దవారిపై విమర్శలు చేస్తే తాము కూడా వారి లెవెల్ నేతలుగా ట్రీట్ చేయబడతామేమో అనే భ్రమలో కొంతమంది విమర్శలు చేస్తున్నట్లున్నారు

Update: 2024-07-10 07:50 GMT

ఇటీవల కాలంలో గౌరవమైన పదవుల్లో ఉన్ననేతలపై వ్యక్తిగత దూషణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వారి కుటుంబ విషయాలపై మాట్లాడటాన్ని కొంతమంది నేతలు ఫ్యాషన్ గా ఫీలవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పెద్దవారిపై విమర్శలు చేస్తే తాము కూడా వారి లెవెల్ నేతలుగా ట్రీట్ చేయబడతామేమో అనే భ్రమలో కొంతమంది విమర్శలు చేస్తున్నట్లున్నారు!

ఈ విషయంలో ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను పలువురు నేతలు స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలు చేయడం, దారుణమైన పదజాలంతో దూషించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత.. తెలంగాణ సీఎం ని డెలివరీ బాయ్ గా అభివర్ణించడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదైంది.

అవును... ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఓ విశ్లేషణ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం సాక్షి టీవీలో జరిగింది. యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ వారిస్తూన్నా నాగార్జున యాదవ్ చెలరేగిపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఈ సందర్భంగా రెచ్చిపోయిన నాగార్జున యాదవ్... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ని స్విగీ, జొమాటో డెలివరీ బాయ్ గా అభివర్ణించారు. "ఆ డెలివరీ బాయ్ కి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత ఉందా?" అంటూ వైసీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. అసలు అతడికి జీవోలు లేదా సంబంధిత ప్రభుత్వ పత్రాలు ఎలా చదవాలో కూడా తెలియదు.. అలాంటీ వారు సీఎం కుర్చీలో కుర్చున్నారు అని నాగార్జున అన్నారు.

ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసీపీ అధికార ప్రతినిధి మాటల దాడి హద్దులు దాటి వెళ్లిన నేపథ్యంలో... సదరు యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కల్పించుకుని ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నాగార్జున యాదవ్ విరుచుకుపడుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా వైసీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News