నాగపూర్ లో సంఘ్ పరివార్ హెడ్డాఫీస్.. నో డ్రోన్ జోన్

సంఘ్ పరివార్ ప్రధాన కార్యాలయ ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-01-29 09:30 GMT

కేంద్రంలోని మోడీ సర్కారుకు మెదడుగా పని చేస్తూ.. తన రాజకీయ ఎజెండాకు తగ్గట్లే కేంద్రం పని చేసేలా చేస్తుందనన విమర్శల్ని ఎదుర్కొనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉండటం తెలిసిందే. నాగపూర్ సిటీలోని మహల్ ప్రాంతంలో సంఘ్ పరివార్ హెడ్డాఫీస్ ఉంది.

సంఘ్ పరివార్ ప్రధాన కార్యాలయ ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెక్యూరిటీ కారణాలతోనే ఇదంతా జరుగుతున్నట్లు చెబుతున్నారు. తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఫోటోలు తీయటం.. వీడియో రికార్డు చేయటంతో పాటు డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు వచ్చేశాయి. జనవరి 29 నుంచి మార్చి 28 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెబుతున్నారు.

మహల్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ కార్యాలయం చుట్టూ పలు హోటళ్లు.. లాడ్జీలు.. కోచింగ్ సెంటర్లు ఉండటంతో నిత్యం హడావుడిగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ప్రజలు ఫోటోలు.. వీడియోలు తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజా ఆంక్షల్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా సీఆర్ పీసీ సెక్షన్ 144(1), (3) ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఈ ఆదేశాల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నాగపూర్ సంయుక్త పోలీసు కమిషనర్ అశ్వతి డోర్జే వెల్లడించారు.





 


Tags:    

Similar News