బాలయ్యకు మహా యోగం....పదవీ వైభోగమేనా ?

నందమూరి తారక రామారావు కుమారుడిగా ఆయన సినీ వారసుడిగా రుజువు చేసుకున్న బాలక్రిష్ణ గత యాభై ఏళ్ళుగా వెండితెరను ఏలుతున్నారు.

Update: 2025-01-20 03:36 GMT

నందమూరి తారక రామారావు కుమారుడిగా ఆయన సినీ వారసుడిగా రుజువు చేసుకున్న బాలక్రిష్ణ గత యాభై ఏళ్ళుగా వెండితెరను ఏలుతున్నారు. ఆయన సినీ జీవితంలో 109 సినిమాలు పూర్తి చేశారు. ఇక గత నాలుగేళ్లుగా చూస్తే బాలయ్య జాతకం మామూలుగా లేదు. ఆయన పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంది.

ఆయన సినిమాలు వరసగా నాలుగు సూపర్ హిట్లు కొట్టడం అది కూడా సీనియర్ లీగ్ లోకి వచ్చేశాక బాలయ్యకు దక్కిన అరుదైన అవకాశంగా చెబుతున్నారు. తొలి హ్యాట్రిక్ భగవంత్ కేసరితో పూర్తి చేసి సెకండ్ హ్యాట్రిక్ కి డాకూ మహారాజ్ సక్సెస్ తో శ్రీకారం చుట్టిన బాలయ్య అఖండ 2 తో మరో బ్లాక్ బస్టర్ ని రెడీ చేసుకున్నారు. ఆ మీదట కూడా పవర్ ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పారు. అలా డబుల్ హ్యాట్రిక్ కి ఆయన బలమైన పునాది వేసేసుకున్నారు.

మరో వైపు ఆయన ఓటీటీ ఫ్లాట్ ఫారంలో చేస్తున్న అన్ స్టాపబుల్ నాలుగు సీజన్లూ వేటికవే సూపర్ హిట్ గా నిలిచి ఆయనను యంగర్ జనరేషన్ కి పూర్తిగా కనెక్ట్ చేసాయి. ఇక బాలయ్య యాడ్స్ లో కూడా నటిస్తూ అన్ని వర్గాలకు చేరువ అయ్యారు.

ఇలా ఆయన తెర జీవితం అత్యంత విజయవంతంగా పండుతోంది. గట్టిగా చెప్పాలీ అంటే బాలయ్య సినీ కెరీర్ లో ఎపుడూ ఇంతటి పీక్ స్టేజి చూడలేదనే అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య జాతకం చూసిన వారు ఆయన పట్టిందల్లా బంగారం అని అంటున్నారు.

జాతకాలు అంటే ఎంతో నమ్మకం కలిగిన బాలయ్యకు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది అని అంటున్నారు ఆయన జాతకం ప్రకారం మరింత కాలం ఆయనకు మహా యోగం కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. ఇక ఇపుడు ఆయన ప్రజా జీవితం గురించి చర్చించుకుంటే ఆయన వరసగా మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీలో ఎక్కువ సార్లు గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు ఈసారి ఒక పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువ మంది యూత్ పైగా కొత్తవారే గెలిచి వచ్చారు. మరి మూడు సార్లు గెలిచిన బాలయ్యకు మంత్రి పదవి అయితే దక్కలేదు. ఒక వైపు చూస్తే కూటమిలో పదవుల విషయంలో హాట్ హాట్ గా చర్చ అయితే సాగుతోంది.

ఒకసారి గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయారు. అఫ్ కోర్స్ ఆయన జనసేన పార్టీకి ప్రెసిడెంట్ గా పొత్తు పార్టీగా ఆ హోదాలో ఉన్నారు అనుకోవచ్చు. అదే విధంగా నారా లోకేష్ కూడా తొలిసారి ఎమ్మెల్యే అయినా కీలకమైన మంత్రిత్వ శాఖలతో దూకుడు మీద ఉన్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ కూడా ఇపుడు జోరుగా సాగుతోంది.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బాలయ్యకు ఏదైనా పదవి దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవి అయితే ఆయనకు దక్కే చాన్స్ లేదు అని అంటున్నారు. దానికి రాజకీయ సామాజిక సమీకరణలు సరిపోవని అంటున్నారు. నిజానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి చూస్తే పయ్యావుల కేశవ్ కి కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన బాలయ్యకు పదవి దక్కదని అంటున్నారు. గతంలో కూడా పరిటాల సునీతకు మంత్రి పదవి ఇవ్వడంతో బాలయ్యకు 2014 నుంచి 2019 మధ్యలో పదవి దక్కలేదని గుర్తు చేస్తున్నారు

అయితే బాలయ్యకు పార్టీ పరంగా ప్రమోషన్ దక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. టీడీపీకి సంబంధించి ఆయనకు కీలకమైన పార్టీ పదవిని ఇస్తారు అని అంటున్నారు. బాలయ్య స్టార్ డం ఇపుడు నలు చెరగులా వ్యాపిస్తోంది. ఆయనకు ఫ్యాన్ మెయిల్ బాగా పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ వస్తున్న బాలయ్యను టీడీపీ మరింతగా ఉపయోగించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

దాంతో ఆయనకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించి రాయలసీమ ప్రాంతంలో టీడీపీని అభివృద్ధిని మరింతగా చేసేలా చూడాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. మరి బాలయ్యకు ఏ పదవి ఇస్తారు ఏమిటి అసలు ఈ ప్రచారంలో నిజమెంత అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News