లోకేష్ స్థానం ఎవరికి? బ్రాహ్మణి ఎంట్రీ ఫిక్స్ ..!
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. నిన్న మొన్నటి వరకు ఇంటికే పరిమితం అయిన.. వ్యక్తులు కూడా మంత్రులుగా రాణిస్తున్న కాలం ఇది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. నిన్న మొన్నటి వరకు ఇంటికే పరిమితం అయిన.. వ్యక్తులు కూడా మంత్రులు గా రాణిస్తున్న కాలం ఇది. సో.. రాజకీయాల్లో ఇప్పుడున్నవారే పరిమితం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. తాజాగా టీడీపీలో మార్పులు జరిగే సూచనలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన దరిమిలా.. మార్పుల దిశగా టీడీపీ లో అడుగులు పడితే.. తొలి మార్పు ఆయన నుంచే ప్రారంభం అవుతుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహి స్తున్నారు. ఇది పార్టీ పరంగా చూసుకుంటే.. నెంబర్ 2 పొజిషన్. పార్టీ అధ్యక్షుడిగాఉన్న నారా చంద్రబాబు నాయుడు తర్వాత.. అంతే స్థాయిలో పార్టీపై నిర్ణయాలు తీసుకోవడం, నాయకులను ముందుండి నడి పించడంలోనూ.. వ్యూహాలు వేయడం, వాటి ని అమలు చేయడంలోనూ జాతీయ ప్రదాన కార్యదర్శి కీలక బాధ్యతలు. ఈ క్రమంలోనే 2014లో తొలిసారి జాతీయ ప్రదాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనదైన పంథాలో ముందుకు సాగుతున్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడ లో నూ.. పార్టీ తరఫున పోరాటాలు చేయడంలో నూ ఆయన తన ను తాను నిరూపించుకున్నారు. తాజా గా విశాఖలో చేసిన ప్రకటన దరిమిలా.. ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని పరిశీలకులు, పార్టీసీనియర్లు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికి.. 10 సంవత్సరాలకు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆయన స్థానానికి రాజీనామా చేస్తే.. కీలకమైన ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఉంది.
అయితే.. పార్టీలో అత్యంత కీలకమైన ఈ పదవిని వేరే వారికి అప్పగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని పార్టీలోకి తీసుకుని.. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమెకు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ ప్రారంభమైంది. ఈ మె రాకతో.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉండడం తో పాటు.. విద్యావంతులను కూడా పార్టీవైపు ఆకర్సించే అవకాశం ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు.
గత ఏడాది ఎన్నికలకు ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే.. జాతీయ ప్రదాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాలా ఆమె అర్హురాలేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తుండడం గమనార్హం. సో.. ఆమెకు అవకాశం దక్కవచ్చని మెజారిటీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.