అసెంబ్లీకి ప్రతిపక్ష నేత లేరు... లోకేష్ క్లారిటీ

ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉందని ఆ పక్షాని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఒక వైపు వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Update: 2024-11-23 04:13 GMT

ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉందని ఆ పక్షాని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఒక వైపు వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఆ విషయం మీద కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే వైసీపీకి 18 కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి విపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో వైసీపీ బడ్జెట్ సమావేశాలు మొత్తం గైర్ హాజరు అయింది.

ఎంతో ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ సెషన్ గైర్ హాజరు కావడంతో వైసీపీ ఇక వచ్చే సమావేశాలకు అయినా హాజరు అవుతుందా అన్నది డౌట్ గానే ఉంది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరూ లేరని మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

ఆయన శాసనమండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కీలక వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయని లోకేష్ అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యం ఉందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో లోకాయుక్త బిల్లులో కూడా సవరణలు చేస్తున్నామని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఛైర్మన్ గా, శాసనసభ స్పీకర్, హోంమంత్రి గాని లేదా ఏదైనా శాఖ మంత్రి, ప్రతిపక్ష నేత, కౌన్సిల్ ఛైర్మన్ సభ్యులుగా ఉండేవారు. శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందని లోకేష్ చెబుతున్నారు.

లోకాయుక్త సవరణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో లోకేష్ చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఏపీ శాసనసభకు ఇక ప్రతిపక్ష నేత లేనట్లే అని కూటమి ప్రభుత్వం భావిస్తొందా అన్న చర్చ వస్తోంది. ప్రతిపక్ష నేతను కూడా చేరుస్తూ

లోకాయుక్త వంటివి ఉంటాయి. అలాగే అనేక కమిటీలలో ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ఇపుడు వైసీపీ గైర్ హాజరుతో వాటిని వేరే విధంగా భర్తీ చేయనున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి ఇక ప్రతిపక్ష పాత్ర లేనట్లే అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ ఏమి చేస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.

అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే రావాలని జగన్ నిర్ణయించిన క్రమంలో ఆ వైపు నుంచి కూడా ఏ రకమైన సడలింపు లేదని భావిస్తున్నారు. దాంతో 2024 నుంచి మొదలైన కొత్త అసెంబ్లీకి విపక్షం లేదు అనే అంటున్నారు. ఆ విధంగా ఈ అసెంబ్లీ కొత్త రికార్డుని నెలకొల్పుతుందా అంటే ఆలోచించాల్సి ఉంది.

Tags:    

Similar News