లోకేశ్ డివోషనల్ ట్రిప్.. ఫొటోలు వైరల్

తాజాగా యువనేత, మంత్రి నారా లోకేశ్ ఉత్తరాది యాత్రకు వెళ్లారు. ఫ్యామిలీతో సహా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన లోకేశ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2025-02-17 10:26 GMT

ఏపీలో కూటమి నేతలు వరుస డివోషనల్ ట్రిప్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళ, తమిళనాడు ఆలయాల సందర్శన పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి రాగా, తాజాగా యువనేత, మంత్రి నారా లోకేశ్ ఉత్తరాది యాత్రకు వెళ్లారు. ఫ్యామిలీతో సహా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన లోకేశ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహాక్రతువుకు వచ్చి పుణ్నస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. కాగా, ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు యువనేత లోకేశ్, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవన్ష్ ను తీసుకుని వెళ్లారు.

త్రివేణి సంగమంలో స్నానాలు చేసిన అనంతరం పూర్తిగా డివోషనల్ గెటప్ లో లోకేశ్ కుటుంబంతో సహా తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో చదువుకున్న లోకేశ్ హిందూ మత విశ్వాసాలను పక్కాగా ఆచరించడం ఆసక్తి రేపుతోంది. మహాకుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, మహాకుంభమేళాకు వెళ్లిన లోకేశ్ అనంతరం వారణశిలో శ్రీ కాశీవిశ్వనాథుడిని దర్శించుకుంటారు. కాశీవిశ్వేశ్వరుడి సన్నిధి నుంచి గంగమ్మకు పూజలు చేస్తారని సమాచారం. మరోవైపు ఈ పర్యటనలోనే మంత్రి లోకేశ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవనున్నట్లు చెబుతున్నారు. ఇక లోకేశ్ తోపాటు పలువురు టీడీపీ ప్రముఖులు కూడా మహాకుంభమేళాకు వెళ్లారు. కేంద్రసహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మంత్రులు గొట్టిపాటి రవి, డోల బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు కుంభమేళాకు హాజరయ్యారు.

Tags:    

Similar News