మరో కుప్పాన్ని చెక్కుతున్న లోకేష్

నారా లోకేష్ పట్టుదల ఏమిటో అందరికీ ఈ అయిదారేళ్ళ కాలంలోనే తెలిసింది అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఆయన మంత్రిగా ఉంటూ మంగళగిరిలో ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేశారు.;

Update: 2025-04-14 05:30 GMT
మరో కుప్పాన్ని చెక్కుతున్న లోకేష్

నారా లోకేష్ పట్టుదల ఏమిటో అందరికీ ఈ అయిదారేళ్ళ కాలంలోనే తెలిసింది అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఆయన మంత్రిగా ఉంటూ మంగళగిరిలో ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అయిదు వేల ఓట్ల తేడాలో ఓటమి పాలు అయ్యారు.

ఇక మంగళగిరి నియోజకవర్గం హిస్టరీ చూస్తే అప్పటికి ఒక మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి గెలుపు అన్నది అయితే లేదు. అటువంటి చోట నుంచి లోకేష్ మొదటిసారి పోటీకి ఎంచుకోవడం అన్నది ఒక రిస్క్ అయితే ఓడిన తరువాత ఆ నియోజకవర్గాన్ని వదిలేయకుండా పట్టుబట్టి అక్కడే మరో అయిదేళ్ళు ప్రతిపక్షంలో పనిచేయడం మరో చరిత్ర.

లోకేష్ తన సొంత ఖర్చుతోనే ఆనాడు మంగళగిరిలో అనేక పనులు చేశారు. తాను ఎందుకు ఓడాను అన్నది తెలుసుకున్నారు. దాంతో జనాలకు నేరుగా కనెక్ట్ అయ్యారు. ఓడినా వారితోనే ఉంటూ వారి కష్టాలలో భాగం పంచుకుంటూ వారికి అండగా ఉన్నారు.

అలా ఆయన అయిదేళ్ళ పాటు పడిన కష్టానికి ప్రతిఫలంగా 2024 ఎన్నికల్లో తొంబై వేలకు పైబడి రికార్డు స్థాయిలో విజయం దక్కించారు జనాలు. ఇక లోకేష్ మంత్రి అయ్యారు. దాంతో ఆయన ఎంతో బిజీగా కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చాం కదా అని సాధారణంగా చాలా మంది ఇంచార్జిలను పెట్టించి అక్కడ అంతా వ్యవహారాలను చూస్తారు.

లోకేష్ వరకూ చూసుకుంటే అటు పార్టీ వ్యవహారాలను చూసుకోవాలి. అలాగే ప్రభుత్వంలో కీలక శాఖలను చూసుకోవాలి. కానీ ఆయన అన్నీ చూసుకుంటూనే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి మంగళగిరిలో ప్రజాదర్బార్ పెట్టారు. అలా ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం చూపిస్తున్నారు

ఇక ఇపుడు ఆయన మన ఇల్లు, మన లోకేష్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు చేసిన హామీలను తీర్చే పనిలో పడ్డారు. అందులో పెద్ద ఎత్తున ఇళ్ళ పట్టాలను పేద ప్రజలకు ఇస్తున్నారు.

అలా ఆయన ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా మూడు వేల మంది పేదలకు తొలి విడతలో ఇళ్ళ పట్టాలను అందచేశారు. అది కూడా ఆషామాషీగా చేయడం లేదు. బట్టలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి మరీ సొంత ఆడబిడ్డకు ఇచ్చే విధంగా ఇంటి పట్టా లోకేష్ అందచేయడం విశేషం.

ఈ విధంగా లోకేష్ కులం మతం ప్రాంతం రాజకీయ పార్టీలు చూసుకోకుండా పేదరికమే అర్హతగా ఈ పట్టాలను అందచేయడం విశేషం. చిత్రమేంటి అంటే ఈ విధంగా ఇళ్ళ పట్టాలు అందుకున్న వారిలో వైసీపీ లబ్దిదారులు కూడా ఉండడం. దాంతో వారు సైతం లోకేష్ మాకు మేలు చేశారు అని చెప్పుకునే పరిస్థితి ఉంది.

ఈ విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి లోకేష్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఒక్కో పట్టా కనీసంగా పది నుంచి పదిహేను లక్షలు విలువ చేసేదిగా ఉంటుంది. అది వారికి తరగని ఆస్తి అనే చెప్పాలి. దాంతో లోకేష్ ని అంతా గ్రేట్ అని అంటున్నారు. ఒక లోకేష్ మరో ఎన్నికల హామీని కూడా తాజాగా నెరవేర్చారు. ఆయన చినకాకానిలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు.

ఇక శంకుస్థాపన చేయడమే కాదు ఏడాదిలో పూర్తి చేయాలని కూడా అధికారులను ఆయన ఆదేశించడం విశేషం. దాంతో లోకేష్ మంగళగిరిని అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధితో కలిపి ముందుకు తీసుకుని వెళ్తున్నారు అని అంటున్నారు. మంగళగిరిలో లోకేష్ అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతున్న వైనం ఇపుడు కనిపిస్తోంది.

దీంతో చంద్రబాబుకు కుప్పం మాదిరిగా లోకేష్ కి తిరుగులేని కంచుకోట లాంటి నియోజకవర్గం మంగళగిరి అని అంటున్నారు. రానున్న రోజులలో లోకేష్ కి ఇది మరో కుప్పం అవుతుందని కూడా చెబుతున్నారు. అంతలా పట్టుదలతో ఓడిన చోటునే కంచుకోకోటగా మార్చుకోవడం అంటే లోకేష్ ఈజ్ గ్రేట్ అని చెప్పకతప్పదని అంటున్నారు.

Tags:    

Similar News