చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమం!
అవును... చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో సుమారు వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యం కారణంగా సుమారు వారం రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే... శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అంటున్నారు.
అవును... చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో సుమారు వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే... ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయం మరింత క్షీణించిందని అంటున్నారు. దీంతో... అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకున్న మంత్రి నారా లోకేష్.. హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
ఇదే సమయంలో... ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు.. హైదరాబాద్ కు చేరుకోనున్నారని అంటున్నారు. ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే మీడియా కాన్ క్లేవ్ లో బాబు పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లాలనేది షెడ్యూల్ అని అంటున్నారు.
కాగా... 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున రామ్మూర్తి నాయుడు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 16,352 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.