రోడ్ల మీదకొచ్చిన నారా నందమూరి ఫ్యామిలీస్ !

ఇపుడు మళ్ళీ యువగళం పేరుతో సభలు లోకేష్ పెడుతున్నారు.

Update: 2024-05-05 03:38 GMT

ఈసారి ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందో ఆ పార్టీ ప్రచారం చేస్తున్న తీరు అమలు చేస్తున్న వ్యూహాలు అన్నీ చూస్తే అర్ధం అవుతాయి. చంద్రబాబు డెబ్బై అయిదేళ్ల వయసులో మండుటెండలో తిరుగుతున్నారు. ఇక నారా లోకేష్ ని యువగళం పేరుతో పాదయాత్ర చేయించారు. ఆ తరువాత శంఖారావం సభలు పెట్టించారు. ఇపుడు మళ్ళీ యువగళం పేరుతో సభలు లోకేష్ పెడుతున్నారు.

ఇక నందమూరి బాలక్రిష్ణ రాయలసీమ అంతటా ప్రచారం చేశారు. ఆ తరువాత ఉత్తరాంధ్ర లో ప్రచారం చేశారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అటు మంగళగిరి, విశాఖ హిందూపురంలలో ప్రచారాన్ని చేస్తున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర అయితే ఏకంగా హిందూపురం లోనే ఉంటూ ప్రచారాన్ని చేపడుతున్నారు.

నారా భువనేశ్వరి తన భర్త తరఫున కుప్పంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆమె ఆ రోజు నుంచి అక్కడే ఉంటూ ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇక నారా చంద్రబాబు తమ్ముడి కుమారుడు నారా రోహిత్ లేటెస్ట్ గా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. మన కోసం నారా రోహిత్ పేరుతో ఆయన శ్రీకాకుళం నుంచి ప్రచారం మొదలెట్టి రాష్ట్రమంతా పర్యటనలు చేస్తున్నారు.

నందమూరి రామక్రిష్ణ కూడా క్రిష్ణా జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టారు. వీరంతా కలసి టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని తన వంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నరు. డూ ఆర్ డై అన్న పరిస్థితుల్లో టీడీపీ ఉంది. ఆరు నూరు అయినా ఈసారి గెలవాల్సి ఉంది. ఈసారి గెలుపుతో టీడీపీకి మరి కొన్ని దశాబ్దాల పాటు కావాల్సిన ఆక్సిజన్ లభిస్తుంది.

ఈసారి టీడీపీ గెలిస్తే కనుక చంద్రబాబుకు అసలైన వారసుడిగా నారా లోకేష్ అవతరిస్తారు. ఆయన ఇదే టెర్మ్ లో సీఎం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అంటే చంద్రబాబులో ఓపిక ఉండగానే టీడీపీ అధికారంలో ఉండగానే నారా లోకేష్ కి అటు ప్రభుత్వం ఇటు పార్టీ పగ్గాలు అందించాలని చూస్తారని ప్రచారం సాగుతోంది. ఆ మీదట నారా లోకేష్ మరింత రాటుతేలుతారని 2029 ఎన్నికల నాటికి టీడీపీకి ఆయనే సోలో లీడర్ గా మారుతారని అంటున్నారు.

ఇవన్నీ నెరవేరాలీ అంటే కనుక కచ్చితంగా ఈసారి టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని అంటున్నారు. పొరపాటున టీడీపీ అధికారం అందుకోకపోతే అనూహ్యమైన ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక టీడీపీకి ఇవి జీవన్మరణ సమస్యగా మారిన ఎన్నికలు కాబట్టే నలభై అయిదు డిగ్రీల వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా నారా నందమూరి కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చేసాయని అంటున్నారు.

Tags:    

Similar News