లోకేష్ ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అడుగులు అంత ఈజీకాదు...?
ఐటీ శాఖ అనేది.. భావోద్రేకాలు.. సంబంధించినది కాదు., ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎవరూ హర్ట్ కారు.
యువ మంత్రి నారా లోకేష్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా పరిస్థితి ఉందా? ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం నారా లోకేష్ రెండు కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఐటీ శాఖపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఇబ్బందులు రావు. పైగా మెప్పులే ఉంటాయి. కానీ, రెండో శాఖైన మానవ వనరుల శాఖ విషయంలో మాత్రం నారా లోకేష్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు.
ఐటీ శాఖ అనేది.. భావోద్రేకాలు.. సంబంధించినది కాదు., ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎవరూ హర్ట్ కారు. కానీ, విద్యా శాఖ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది లక్షలాది మంది విద్యార్థులపైనా.. ఉపాధ్యాయులపైనా.. తల్లిదండ్రులపైనా ప్రభావం చూపించే అవకాశం మెండుగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాయి. ఉపాధ్యాయులు ధర్నాలు.. నిరసన పేరుతో అట్టుడికించారు.
దీనికి ప్రధాన కారణం.. అటెండెన్సు, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, బాత్ రూంల పర్యవేక్షణ, విద్యార్థుల పుస్తకాల పంపిణీ వంటి కీలక అంశాలు. నిజానికి ఈ పనులు ఎక్కడైనా ఉపాధ్యాయులే చేయాలి. గతంలోనూ ఈ రూల్ ఉంది. కానీ, అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. ఫలితంగా ప్రబుత్వ పాఠశాలలంటే.. సమాజంలో ఏవగింపు వచ్చింది. కానీ, దీనిలో కొంత మార్పు తీసుకువస్తూ.. జగన్ సర్కారు మంచి పనే చేసింది. కానీ, అర్ధమయ్యే లా చెప్పడంలో లోపమో.. లేక ఒత్తిడి గురిచేస్తున్నారన్న భావన ఉద్యోగుల్లో కలగడమో జరిగింది.
దీంతో ఉపాధ్యాయులు వైసీపీ ప్రబుత్వంపై కత్తికట్టారు. కానీ.. పరీక్షల ఫిలితాల విషయానికి వస్తే.. మాత్రం గతంలో కంటే వ్యవస్థ మెరుగు పడిందని.. నిపుణులు సైతం అంగీకరించారు. ఇక, ఇప్పుడు ఈ శాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏం చేస్తారు? ఉపాధ్యాయులు ఇష్టపడని వాటిని తీసేస్తారా? అలా తీసేస్తే.. ప్రబుత్వ పాఠశాలలు భ్రష్టు పట్టిపోతాయి. పోనీ.. కొనసాగించాలంటే.. గత ప్రభుత్వం మాదిరిగానే నిరసనలు ఖాయం. ఎలా చూసుకున్నా.. వీటిని సమన్వయం చేయడం అతి ముఖ్యం. నిజానికి చెప్పాలంటే.. వైసీపీ హయాంలో విద్యార్థుల తల్లిదండ్రులు హ్యాపీ. కానీ, ఉపాధ్యాయులే ఫైరయ్యారు. ఇప్పుడు వీరిని ఎలా లోకేష్ ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి.