నాడు జగన్... నేడు లోకేష్...అవి ఊగిపోయాయి!

టీడీపీలో లోకేష్ ని హైలెట్ చేయడానికే పాదయాత్ర అన్నది తెలిసిందే. అందులో భాగంగా లోకేష్ చాలా జిల్లాలు తిరిగారు.

Update: 2023-08-20 03:00 GMT

ఇప్పటికి అయిదేళ్ళ క్రితం ఇదే నెలలలో జరిగిన ఒక సన్నివేశం మళ్లీ ఇన్నాళ్ళకు గుర్తుకు వస్తోంది. 2018 జూలై ఆగస్ట్ నెలలలోనే జగన్ తూర్పు గోదావరిలో ప్రవేశించే వేళ రాజమండ్రి వంతెన జన సందోహంతో ఊగిపోయింది. అటూ ఇటూ చూస్తే ఇసుకవేస్తే రాలనంతగా జనాలు తరలివచ్చారు. ఎటు చూసినా జనమే జనంగా కనిపించారు అలా జగన్ ప్రభంజనం నాడు కనిపించింది.

ఇపుడు గుంటూరు జిల్లా నుంచి లోకేష్ ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోనికి ప్రవేశించారు. ప్రకాశం బ్యారేజ్ అంతా జనమే జనంగా కనిపించింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా నిండిపోయారు. మొత్తం ఎక్కడ చూసిన పసుపు తోరణాలతో ఘనంగా కనిపించాయి. అలా లోకేష్ కి క్రిష్ణా జిల్లాలో భారీ ఎత్తున స్వాగతం లభించింది.

నిజానికి చూస్తే క్రిష్ణా జిల్లాలో టీడీపీకి మొదటి నుంచి బలం ఉంది. 2019 ఎన్నికలు డిఫరెంట్ కోణంలో చూడాల్సి ఉంటుంది. అయితే టీడీపీకి బలం బాగా ఉన్న జిల్లాలోకి లోకేష్ ప్రవేశిస్తున్న వేళ క్యాడర్ అంతా ఒక్క చోట చేరి ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఈ తరహా స్వాగతం గతంలో చంద్రబాబుకు పాదయాత్రలో సైతం ఈ స్థాయిలో దక్కలేదు.

అయితే యువ నేత, భావి వారసుడు, టీడీపీకి రేపటి దిక్కు అన్న భావనతో లోకేష్ కి టీడీపీ వారు అంతా కాలసి ఏర్పాటు చేసిన స్వాగతంగానే చూస్తున్నారు. టీడీపీలో లోకేష్ ని హైలెట్ చేయడానికే పాదయాత్ర అన్నది తెలిసిందే. అందులో భాగంగా లోకేష్ చాలా జిల్లాలు తిరిగారు. కొన్ని చోట్ల ఆయనకు మంచి స్వాగతం లభించింది మరి కొన్ని చోట్ల తక్కువగా ఆదరణ దక్కింది.

ఓవరాల్ గా చూస్తే లోకేష్ కి క్రిష్ణా జిల్లాలో లభించిన స్వాగతం మొత్తం పాదయాత్రకే హైలెట్ అని చెప్పాల్సి ఉంది. లోకేష్ లో రేపటి తరం నాయకుడిని చూసుకుంటూ ఆయన్ని ఏపీలో ఉన్న జగన్ పవన్ ల సరిసాటిగా జనాదరణ ఉన్న నేతగా చూపించే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని అంటున్నారు. దాంతో పాటు టీడీపీకి హార్ద్ కోర్ జిల్లా క్రిష్ణా అని చెప్పాలి. ఈసారి ఓడిన చోట గెలవాలన్న పట్టుదల కూడా నాయకులలో క్యాడర్ లో ఉంది. దాంతో లోకేష్ కి పలికిన ఈ స్వాగతం అంతా చెప్పుకోవాలని వైరల్ అవాలని ఆశతో చేశారని అంటున్నారు.

ఏది ఏమైనా జగన్ కి నాడు రాజమండ్రీ వంతెన ఊగితే ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ ఊగింది. అంతలా జనాలు వచ్చారు. మరో వైపు క్రిష్ణా నదిలో పడవలు కట్టుకుని వాటికి టీడీపీ జెండాలు కట్టి మరీ లోకేష్ కి స్వాగతం పలకడం ఇంకో హైలెట్ గా చూడాలి, నాలుగు రోజుల పాటు క్రిష్ణా జిల్లాలో లోకేష్ యాత్ర ఏ విధంగా సాగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News