నారా లోకేష్ 'రెడ్ బుక్‌' కేసు.. తాజా అప్డేట్ ఇదే!

దీంతో ఇదే విష‌యాన్ని కోర్టుకు చెబుతూ.. అధికారులు మ‌రో కేసు న‌మోదు చేశారు. ఏకంగా నారా లోకేష్‌ను అరెస్టు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరారు.

Update: 2024-02-13 09:49 GMT

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. త‌మ‌ను `రెడ్ బుక్` పేరుతో బెదిరిస్తున్నారంటూ.. ఏపీ సీఐడీ అధికారులు న‌మోదు చేసిన కేసు గురించి తెలిసిందే. ఈ కేసులో తాజాగా అధికారులు చార్జిషీట్ ను కోర్టుకు స‌మ‌ర్పించారు. తొలుత దీనిని విచారించిన ఏసీబీ కోర్టు.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయా ల‌ని అధికారుల‌ను ఆదేశించింది. దీంతో అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. అయితే.. వాటిని తీసుకునేందుకు నారా లోకేష్ అంగీక‌రించలేదు.

దీంతో ఇదే విష‌యాన్ని కోర్టుకు చెబుతూ.. అధికారులు మ‌రో కేసు న‌మోదు చేశారు. ఏకంగా నారా లోకేష్‌ను అరెస్టు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరారు. ఈ కేసుపై తాజ‌గా ఏసీబీ కోర్టులో విచారణ జరిగిం ది. విచార‌ణ సంద‌ర్భంగా.. నారాలోకేష్ హెచ్చ‌రిస్తున్న‌ రెడ్ బుక్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు వివ‌రించారు. అయితే.. ఈ కేసును మ‌రింత లోతుగా విచారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంటూ.. ఏసీబీ కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఏంటీ కేసు!

నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్ర చేప‌ట్టిన‌ప్పుడు.. వైసీపీ ప్ర‌భుత్వం నుంచి అడ్డంకులు వ‌చ్చాయి. కొంద‌రు పోలీసులు.. ఇత‌ర విభాగాల అధికారులు కూడా.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను అడ్డుకునే ప్ర‌య త్నాలు చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ అనుమ‌తులు నిరాక‌రించారు. దీంతో చిత్తూరు జిల్లాలో తొలిసారి రెడ్ బుక్ ప్ర‌స్తావ‌న వెలుగులోక వ‌చ్చింది. త‌మ‌ను అడ్డుకుంటున్న వారి పేర్ల‌ను ఈ పుస్త‌కంలో న‌మోదు చేస్తున్నామ ని.. అధికారంలోకి వ‌చ్చాక‌.. వారి సంగ‌తి తేలుస్తామ‌ని.. స‌భ‌లోనే నారా లోకేష్ హెచ్చ‌రించారు. అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హారాన్ని లైట్ తీసుకున్న అధికారులు త‌ర్వాత‌.. త‌ర్వాత‌.. ఏమైందో .. సీరియ‌స్ అయ్యారు. చివ‌ర‌కు యువ‌గ‌ళం యాత్ర‌.. తూర్పులోకి ప్ర‌వేశించాక‌.. కేసులు న‌మోదు చేశారు.

Tags:    

Similar News