``మోడీ-ముర్ము.. హిందువులు కాదు``
నిత్యం విమర్శలు, వివాదాలతో రాజకీయాల్లోనే నేతలు మాత్రమే కాదు.. స్వాములు, సన్యాసులు కూడా కాలం వెళ్ల దీస్తున్నారు.
నిత్యం విమర్శలు, వివాదాలతో రాజకీయాల్లోనే నేతలు మాత్రమే కాదు.. స్వాములు, సన్యాసులు కూడా కాలం వెళ్ల దీస్తున్నారు. ఇలాంటి వారిలో జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒకరు. అయోధ్య రామమందిరంలో బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలోనూ అవిముక్తేశ్వరానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయం పూర్తికాకుండానే ప్రారంభం ఏంటని ఆయన ప్రధానిని నిలదీశారు. ఇక, గోవధపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు మరోసారి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములపైనా కామెం ట్లు కుమ్మరించారు. మోడీ-ముర్ములు అసలు హిందువులే కారని అవిముక్త సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు.. తాము హిందువులమని చెప్పుకొనే వారు.. దేశంలో గోవధను నిషేధించలేక పోతున్నారని.. ఇలాంటివారు హిందువులు ఎలా అవుతారని అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రశ్నించారు.
దేశంలో ఇప్పటి వరకు ప్రధానులుగా, రాష్ట్రపతులుగా చేసిన వారు ఎవరూ కూడా హిందువులు కారని అవి ముక్తేశ్వర వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. వారంతా గోవులను సంరక్షించలేక పోయారని.. గోవధను అడ్డు కోలేక పోయారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. యూపీలో ఉన్న ముఖ్యమంత్రి పక్కా సాధువేనని.. సన్యాసం తీసుకున్నారని అలాంటి ఆయన పాలనలోనూ యూపీలో గోవధ ఆగలేదన్నారు. అంతేకాదు.. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింతగా గోమాంసం ఎగుమతి అవుతోందన్నారు.
ఇలాంటివారి వల్ల హిందూ ధర్మానికి, గోవులకు రక్షణ ఎక్కడుందో చెప్పాలని అవిముక్త ప్రశ్నించారు. పైకి హిందువుల మని చెప్పుకొంటున్నా.. వారికి ఆ ధర్మంపై విశ్వాసం లేదన్నారు. అందుకే వారిని హిందువు లుగా పరిగణించలేమన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.