మోడీ వచ్చారు...లడ్డూ ఇష్యూలో ఏమంటారో ?

ఏపీలో తీవ్ర స్థాయిలో చెలరేగిన శ్రీవారి మహా ప్రసాదం లడ్డూల ఇష్యూ ఒక వైపు ఉండగానే మూడు రోజుల అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్లారు.

Update: 2024-09-24 16:30 GMT

ఏపీలో తీవ్ర స్థాయిలో చెలరేగిన శ్రీవారి మహా ప్రసాదం లడ్డూల ఇష్యూ ఒక వైపు ఉండగానే మూడు రోజుల అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ తన టూర్ ని విజయవంతంగా ముగించుకుని ఇండియాలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.

మోడీ ఇలా రావడమేమిటి అలా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు గ్రీట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలుకుతున్నాను అని బాబు పేర్కొన్నారు. మీ నాయకత్వంలో పని చేయడం మా అదృష్టం అని కూడా అన్నారు.

ప్రపంచంలో భారత్ శక్తిని మరింతగా పెంచి గర్వకారణం అయ్యారని మోడీ దక్షతను కొనియాడారు. ఈ రోజున ప్రపంచలో అతి పెద్ద నాయకుడిగా మోడీ నిలిచారు అని బాబు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచంలోని దేశాలను ఏకం చేస్తున్నారు అన్నారు. మోడీ ఈ పర్యటన భారత్ ప్రపంచంలో తన పాత్రను రానున్న కాలంలో మరింతంగా చాటి చెప్పేందుకు ఆస్కారం ఏర్పడేలా చేసింది అని అన్నారు.

ఇలా మోడీ విదేశీ పర్యటనలు ఎన్నో చేశారు. కానీ ఎపుడూ ఈ బాబు మోడీని ఈ విధంగా గ్రీట్ చేయలేదు. ఈసారి మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. మరి ఎందుకు ఇలా అన్నదే చర్చ సాగుతోంది. ఏపీ ఇపుడు చాలా రగులుతోంది. ఒక వర్గం మనోభావాలు పూర్తిగా గాయపడ్డారు. శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రతిపక్ష వైసీపీని కార్నర్ చేసే తీరు కొనసాగుతోంది

కానీ అసలు ఈ ఇష్యూని ఎందుకు టేకప్ చేశారు అన్నది కూడా హిందువులలో ఒక సెక్షన్ లో ఉంది అని అంటున్నారు. దాంతో పాటుగా ఇది రాజకీయ రంగు పులుముకోవడంతోనే కొన్ని వర్గాలు మండుతున్నాయి. దీనికి సరైన ముగింపు ఎలా అన్నది కూడా అర్ధం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ సీబీఐ విచారణ కోరుతోంది.

ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. ఆ సమయంలో మోడీ అమెరికాలో ఉన్నారు. ఇపుడు మోడీ తిరిగి వచ్చారు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇంకో వైపు న్యాయస్థానాలలో కూడా పిల్ దాఖలు అయింది. అది విచారణకు వస్తే ఎలాంటి డైరెక్షన్ కోర్టు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వం అయితే తన ఆధ్వర్యంలో సిట్ తో విచారణ ముగించాలని చూస్తోంది. మరి కేంద్రం ఈ విధగ్నా సహకరిస్తే ఓకే. అలా కాకుండా సీబీఐ విచారణకు ఆదేశిస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే బీజేపీకి టీడీపీ జనసేన మిత్ర పక్షాలు వాటిని కాదని కేంద్రంలోని పార్టీ కూడా ఎలాంటి వేరే నిర్ణయం తీసుకోదని అంటున్నారు.

దాంతో న్యాయ విచారణ విషయంలోనే అంతా ఎదురుచూస్తున్నారు. అయితే మోడీ శ్రీవారి లడ్డూస్ కల్తీ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటిదాకా అయితే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాత్రమే రియాక్ట్ అయ్యారు. మోడీ అమిత్ షా లెవెల్ లో రియాక్ట్ అయితే అపుడు ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మరి చంద్రబాబు మోడీ నాయకత్వాన్ని చూస్తే అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. జగన్ లేఖ మీద కూడా ప్రధాని ఆఫీసు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని టీడీపీ కోరుకుంటోంది.

రాజకీయంగా ఉన్న లెక్కలు సమీకరణలు చూసినా ఏమి జరుగుతుంది అనేది ఆసక్తిని కలిగించే అంశం. ఏది ఏమైనా మోడీ కనుక శ్రీవారి లడ్డూల కల్తీ విషయంలో స్పందిస్తే మాత్రం ఆయన చెప్పే మాటలు ఇచ్చే డైరెక్షన్ల ద్వారానే భక్తులకు స్వాంతన కలుగుతుంది అని అంటున్నారు. ఆ దిశగా ఆయన మాట్లాడాలని టీడీపీ కూటమి కూడా కోరుకుంటోంది అని అంటున్నారు.

Tags:    

Similar News