ఇన్ని జరిగిన తర్వాత కూడా మోడీకి మిత్రులుగా ఉన్న 39 పార్టీలేంటి?

మిత్రుడు వేరు.. రాజకీయ మిత్రుడు వేరు

Update: 2023-07-19 06:23 GMT

మిత్రుడు వేరు.. రాజకీయ మిత్రుడు వేరు. మిగిలిన స్నేహాలతో పోలిస్తే రాజకీయ స్నేహంలో లెక్కలే కీలకమన్న సంగతి తెలిసిందే. రెండు దఫాలుగా అధికారాన్ని చేపట్టి.. ముచ్చటగా మూడోసారి సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న మోడీ అండ్ కోకు.. గడిచిన పదేళ్లలో ఉన్నట్లుండి మిత్రులు గుర్తుకు వచ్చారు.

అప్పుడెప్పుడో 2014లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన తర్వాత.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో తన మిత్రుల్ని పార్లమెంటులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆహ్వాన మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన మోడీ మాష్టారు.. ఆ తర్వాత కూటమిని.. కూటమిలోని మిత్రుల్ని పిలిచి మీటింగ్ పెట్టటం ఇదే తొలిసారిగా చెప్పాలి.

విపక్షాలన్ని జత కట్టి బెంగళూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేళలోనే.. అందుకు పోటీగా దేశ రాజధానిలో నిర్వహించిన మిత్రుల సమావేశం ఆసక్తికరంగా మారింది. తనతో మిత్రులుగా ఉన్న వారితో ఏదో ఒక విషయంలో పంచాయితీ పెట్టుకొని.. వారికి దూరం కావటమో.. లేదంటే వారిని దూరం పెట్టటమో చేసే మోడీ మాష్టారితో నడుస్తున్న బీజేపీకి మిత్రులు ఉన్నారా? అన్నది చాలామందికి అనుమానం.

మోడీ మాష్టారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 39 పార్టీలు హాజరయ్యాయన్న వార్త విన్నంతనే.. అంతమంది మిత్రులు ఉన్నారా? అన్న సందేహం కలుగుక మానదు. ఈ తరహా సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందుతుందన్న అంచనాలు వినిపించినా.. అదేమీ లేదన్న విషయాన్ని బీజేపీ స్పష్టత ఇవ్వటం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానాన్ని పంపకపోవటం ద్వారా.. రానున్న రోజుల్లో ఆ పార్టీతో పొత్తు విషయంపై కొంత మేర క్లారిటీ ఇచ్చేసింది. అయితే.. దింపుడు కళ్లెం ఆశలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో వినిపించాయి.

ఇదిలా ఉంటే.. ఇంతకూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా హాజరైన 39 పార్టీలు ఏమిటన్న కుతూహలం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఆ లెక్క చూస్తే.. అందులో చాలా పార్టీలు గడిచిన పదేళ్లలో మోడీషాల మాస్టర్ మైండ్ తో తమకు తగ్గట్లు ముక్కలు చేసిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఇంతకూ 39 పార్టీల లిస్టు చూస్తే..

1. బీజేపీ

2. శివసేన (షిండే వర్గం)

3. ఎన్సీపీ (అజిత్ వర్గం)

4. ఆర్ ఎల్ జేపీ (పశుపతి పరాస్)

5. ఎఐఏడీఎంకే

6. అప్నాదళ్ ( సోనేలాల్)

7. ఎన్ పీపీ

8. ఎన్ డీపీపీ

9. సిక్కిం క్రాంతికారీ మోర్చా

10. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్

11. నాగా పీపుల్స్ ఫ్రంట్

12. ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర

13. మిజో నేషనల్ ఫ్రంట్

14. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

15. అస్సాం గణపరిషత్

16. పట్టల్ మక్కల్ కట్చి

17. తమిళ మానిల కాంగ్రెస్

18. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్

19. సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ

20. శిరోమణి అకాళీదళ్ (సంయుక్త)

21. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ

22. జన నాయక్ జనతా పార్టీ

23. ప్రహార్ జన్ శక్తి

24. రాష్ట్రీయ సమాజ్ పక్ష

25. జన్ సురాజ్య శక్తి పార్టీ

26. కుకి పీపుల్స్ అలయన్స్ః

27. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ)

28. హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ

29. నిషాద్ పార్టీ

30. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్

31. హమ్

32. జనసేన

33. హరియాణా లోక్ హిత్ పార్టీ

34. భారత్ ధర్మ జనసేన

35. కేరల కామరాజ్ కాంగ్రెస్

36. పుతియ తమిళగం

37. లోక్ జనశక్తి పార్టీ (చిరాగ్)

38. గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్

Tags:    

Similar News