చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ కొందరు యువకులపై ఎందుకు సీరియస్ అయ్యారు?

సభలో ప్రత్యేక ఆకర్షణగా మోదీ నిలిచారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న సందర్భంగా కొందరు యువకులు లైట్ పోల్స్ ఎక్కి మరీ చూశారు.

Update: 2024-03-17 14:34 GMT

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. ఇందులో భాగంగా చిలుకలూరిపేట బొప్పూడిలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ నిర్వహించింది. ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా టీడీపీ, జనసేన చేరిన సందర్భంగా నిర్వహించిన మొదటి బహిరంగ సభ కావడంతో అశేష జనవాహిని తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం జనంతో దద్దరిల్లింది. ఎటు చూసిన జనమే కనిపించడంతో కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి.

సభలో ప్రత్యేక ఆకర్షణగా మోదీ నిలిచారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న సందర్భంగా కొందరు యువకులు లైట్ పోల్స్ ఎక్కి మరీ చూశారు. దీంతో వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారించారు. వాటిపై ఎక్కొద్దని సూచించారు. అయినా వారు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు చెబితే అర్థం కాదా అని కోపం తెచ్చుకున్నారు.

మీరు మా సభకు వచ్చారు. సురక్షితంగా ఇంటికి వెళ్లాలి. మీ తల్లిదండ్రులకు శోకం మిగిల్చొద్దు. మంచి మాట చెప్పినప్పుడు వింటే బాగుంటుందని హితవు పలికారు. చివరకు పోలీసులను పురమాయించి వారిని దించాల్సిందిగా సూచించారు. మొత్తానికి సభ సక్సెస్ అయిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటి సభ విజయవంతం కావడంతో మూడు పార్టీల నేతల్లో హర్షం వ్యక్తమైంది.

ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జగన్ ను ఇంటికి సాగనంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి సీఎం పాలనకు చరమగీతం పాడతామని పేర్కొన్నారు. దోపిడీ పాలనకు త్వరలోనే ముగింపు పలికే సందర్భం వచ్చిందన్నారు. పాలనలో మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మా పాలన ఉంటుందని చెబుతున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రజల కోసం నిరంతరం పాటుపడుతుంటాయి. ప్రజల సమస్యలు తెలుసుకుని మసలుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తాం. ఆంధ్రప్రదేశ్ ను సుభిక్షంగా మారుస్తాం. మమ్మల్ని నమ్మండి. మీ సమస్యలు తీరుస్తాం. మీకు సరైన పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి రావడం తథ్యమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News