ఈ ఏడాదికి సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ లేదు!.. ఎప్పుడంటే..?

అవును... అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ ల తిరుగు ప్రయాణం ఈ ఏడాదికి లేదని నాసా స్పష్టం చేసింది.

Update: 2024-08-26 07:22 GMT

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు జూన్ 5 తర్వాత 8 రోజులకే తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ.. రాలేకపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి తిరుగు ప్రయాణంపై నాసా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఈ ఏడాదికి సునీతా విలియమ్స్, బుచ్ విల్ మో ర్ ల తిరుగు ప్రయాణం లేదని స్పష్టం చేసింది.

అవును... అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ ల తిరుగు ప్రయాణం ఈ ఏడాదికి లేదని నాసా స్పష్టం చేసింది. వచ్చే ఏడాదిలోనే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఇందులో భాగంగా... స్పేస్ ఎక్స్ కు చెందిన క్ర్యూ డ్రాగన్ క్యాప్సుల్ లో వచ్చే ఫిబ్రవరిలో వీరిరువురూ తిరిగి బయలుదేరతారని నాసా పేర్కొంది.

కాగా.. బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో జూన్ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్ అయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిని తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యవస్థలో తీవ్ర ప్రమాదకరమైన సమస్యలు తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్... అంతరిక్షయానం ఎంతో సురక్షితం, సాధారణం అయినప్పటికీ ఎప్పటికీ ప్రమాదకరమే అని అన్నారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సురక్షితం కానే కాదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విలియమ్స్, విల్ మోర్ లను స్పేస్ స్టేషన్ లోనే మరికొన్ని రోజులు ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు

Tags:    

Similar News