ట్విస్టు: మేరఠ్ మర్డర్ కేసులో జైల్లో ఉన్న ముస్కాన్ ప్రెగ్రెంట్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మర్చంట్ నేవీ అధికారి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది.;

Update: 2025-04-08 04:48 GMT
ట్విస్టు: మేరఠ్ మర్డర్ కేసులో జైల్లో ఉన్న ముస్కాన్ ప్రెగ్రెంట్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మర్చంట్ నేవీ అధికారి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రేమించి పెళ్లాడిన భర్తను.. ప్రియుడి కోసం అత్యంత దారుణంగా హతమార్చిన వైనం షాకింగ్ గానే కాదు.. సరికొత్త ఆందోళనకు గురి చేసేలా చేసింది. మర్చంట్ నేవీ అధికారిగా ఉన్న భర్త సౌరభ్ రాజ్ ఫుత్ ను మాటల్లో చెప్పలేనంత దారుణంగా హతమార్చిన వైనం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమె.. గర్భవతిగా అధికారులు గుర్తించారు. దీంతో.. ఇప్పుడేం చేయాలన్న దానిపై జైల్ మాన్యువల్స్ ను చెక్ చేస్తున్నారు.

అంతేకాదు.. ముస్కాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఇటీవల ప్రెగ్నెన్సీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా తేలినట్లుగా డాక్టర్లు వెల్లడించిన విషయాన్ని సదరు లేఖలో పేర్కొన్నారు. 29 ఏళ్ల సౌరభ్ రాజ్ పుత్.. 27 ఏళ్ల ముస్కాన్ రస్తోగీ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో అధికారిగా వ్యవహరించేవారు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తరవాత పాతికేళ్ల సాహిల్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

భార్యకు మర్చంట్ నేవీ అధికారిగా పని చేయటం ఇష్టం లేదని తేలియటంతో జాబ్ మానేశారు. అయినప్పటికి ఆమె తీరులో మార్పు రాకపోవటం.. ఆమెక సాహిల్ తో ఉన్న రిలేషన్ నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో సౌరభ్ లండన్ కు వెళ్లిపోయి.. అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా..కుమార్తె పుట్టిన రోజు కోసం భారత్ కు వచ్చాడు. అతను ఇంటికి రావటం నచ్చని ముస్కాన్.. ప్రియుడి సాయంతో సౌరభ్ ను 15 ముక్కలుగా నరికేసి.. శరీర భాగాల్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచేసి.. దానిపై సిమెంట్ తో కప్పి పెట్టారు.

పక్కాగా ప్లానింగ్ తో చేసిన ఈ దారుణం సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన కంప్లైంట్ కారణంగా.. ఈ మొత్తం మర్డర్ వ్యవహారం వెలుగు చూసింది. అంతేకాదు.. భర్తను దారుణంగా హత్య చేసిన తర్వాత.. అతడి దగ్గర ఉన్న డబ్బులతో సాహిల్ చేత బెట్టింగులు ఆడించి.. ఆ డబ్బులతో విహార యాత్రలకు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారిద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుల్ని జైలుకు తరలించిన తర్వాత.. వీరి వ్యవహారశైలి వార్తల్లోకి వచ్చింది. దీనికి కారణం.. జైల్లో పెట్టిన ఆహారాన్ని తినకుండా డ్రగ్స్ కావాలని గొడవ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇలాంటి వేళ ముస్కాన్ గర్భం దాల్చిన వైనంతో ఇప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News