ఎన్సీఎల్టీ లో 9న విచారణ : జగన్ షర్మిల ఆస్తుల కేసులో ఏమి జరుగుతుంది ?

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఈ నెల 9న జగన్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరగనుందని ప్రచారం సాగుతోంది.

Update: 2024-11-04 00:30 GMT

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఈ నెల 9న జగన్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరగనుందని ప్రచారం సాగుతోంది. ఈ కేసులో జగన్ తన ప్రమేయం లేకుండా సరస్వతి సిమెంట్ ప్రాజెక్ట్ లో షేర్లు బదిలీ అయ్యాయని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ తొలి విచారణను ఈ నెల 9న చేపట్టనుంది.

ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రతివాదులుగా జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిలను చేర్చారని అంటున్నారు. దాంతో ఈ కేసులో వారి తరఫున న్యాయవాదులు ఏ రకమైన వాదనలు వినిపిస్తారో చూడాలని అంటున్నారు. ఇదిలా ఉంటే 2019 ఆగస్ట్ నెలలో జగన్ తన సోదరికి హామీ ఇచ్చేలా తల్లి పేరు మీద సరస్వతి సిమెంట్ ప్రాజెక్ట్ లో నుంచి షేర్లు రాశారని చెబుతున్నారు.

ఆ మేరకు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈడీ అటాచ్ చేసిన ఈ ఆస్తుల విషయంలో అన్నీ కేసులూ కోర్టు ద్వారా పరిష్కారం అయ్యాకనే వాటిని బదిలీ చేసుకోవాలని కూడా రాసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు విషయం ఇలా ఉండగా తనకు తెలియకుండా విజయమ్మ నుంచి షేర్ల బదిలీ షర్మిలకు అయ్యాయని ఆరోపిస్తూ జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లారని అంటున్నారు. ఆయన సెప్టెంబర్ లో దీని మీద అక్కడ పిటిషన్ దాఖలు చేశారు.

ఇక దీనిని విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ కంపెనీ లా ప్రకారం అన్నీ కూలంకషంగా పరిశీలిస్తుందని అంటున్నారు. అదే విధంగా జగన్ కి తెలియకుండా షేర్లు బదిలీ అయ్యాయా అన్నది కూడా చూస్తారా అన్నది మరో చర్చగా ఉంది. ఒకవేళ అలాంటిది జరిగితే ఏమి చేస్తారు అన్నది మ్రో ప్రశ్నగా ఉంది.

ఈ పరిణామాల నేపధ్యంలో నవంబర్ 9న ట్రిబ్యునల్ వైపు అందరి చూపూ ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే తన కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని జగన్ కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఇటీవల పులివెందులకు వెళ్ళినపుడు అక్కడ తన బంధువులు అందరికీ కలసి వచ్చారని అంటున్నారు.

వారి ద్వారా తల్లి సోదరితో వివాదాలకు ముగింపు పలకాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక వైఎస్సార్ కుటుంబం చాలా పెద్దది అన్నది తెలిసిందే. ఇందులో ఎవరు ఎవరి వైపు ఉన్నారు అన్నది పరికిస్తే కనుక మెజారిటీ జగన్ వైపే ఉన్నారు అని అంటున్నారు.

వైసీపీ అధినేత వైపు విజయమ్మ సోదరుడు, సొంత మేనమామ అయిన రవీంద్ర రెడ్డి, అలాగే వైఎస్ అవినాష్ ఆయన తండ్రి భాస్కరరెడ్డి, మరో చిన్నాన్న మనోనర్ రెడ్డి, వైఎస్సార్ ఏకైక చెల్లెలు విమలమ్మ ఆమె కుటుంబం కూడా జగన్ వైపే ఉన్నారు అని అంటున్నారు. అలాగే వైఎస్సార్ కుటుంబం మొత్తానికి వయసులో పెద్ద వారు అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డి కూడా జగన్ వైపే అని అంటున్నారు.

ఇక వైఎస్ షర్మిల వైపు ఆమె తల్లి విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, ఆమె కుమార్తె సునీత మద్దతుగా ఉన్నారు అని అంటున్నారు. ఇలా చూస్తే కనుక పులివెందులలో వైఎస్సార్ కుటుంబం రెండుగానే చీలిపోయింది అని అంటున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం జగన్ వైపే ఉండడం వైసీపీకి కొండంత ఊరటగానే ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కుటుంబపరమైన వివాదాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. ట్రిబ్యునల్ ద్వారా న్యాయపరమైన ఉపశమనంతో పాటు కుటుంబ పరంగా కూడా రిలీఫ్ పొందాలని ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News