ఎన్డీయే కూటమి... `అక్కడ - ఇక్కడ`.. మేలెక్కడ?
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉంది.. మనకు మేలు చేస్తుందని చంద్రబాబు అండ్ కో చాలా నే ఆశలు పెట్టుకున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉంది.. మనకు మేలు చేస్తుందని చంద్రబాబు అండ్ కో చాలా నే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఎంత మన ప్రభుత్వమని చంద్రబాబు అనుకున్నా.. ఆయన ఆశించి న రేంజ్‌కు అటు ఇటుగా కూడా మోడీ సర్కారు పెద్దగా చొరవ చూపడం లేదని స్ఫష్టంగా తెలుస్తోంది. ఏపీలో కూటమి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు అధికారికంగా.. 8 సార్లు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నా రు. వాస్తవానికి ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి 100 రోజులు మాత్రమే అయింది.
అయినా.. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధుల అంశంపై చర్చించేందుకు, రాబట్టు కునేందుకు 8 సార్లు ఢిల్లీ వెళ్లారు. 8 సార్లూ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. బాధలు చెప్పారు. బరువు దింపమని పేర్కొన్నారు. దీనికి ప్రతిసారీ తలాడించడమే తప్ప.. మోడీ సర్కారు ఆశించిన విధం గా అయితే.. బాబుకు దన్నుగా నిలవడం లేదు. పైకి అంతా బాగానే ఉన్నా.. ఈ విషయంలో కూటమి నాయకుల మధ్య కూడా చర్చ వస్తోంది.
అమరావతి రాజధానికి అప్పులు ఇప్పిస్తామని కేంద్రం చెప్పింది. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన చేసి రెండు మాసాలు అయిపోయింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా వచ్చి అమరావతిలో చూసి వెళ్లారు. ఇంకేముంది.. నిధులు వస్తున్నాయని ప్రకటనలు వచ్చాయి. కానీ, నిధులు మాత్రం రాలేదు. తాజాగా ఈ విషయం పై చంద్రబాబు మోడీని సంప్రదిస్తే.. `ప్లీజ్ వెయిట్` అనే సమాధానం వచ్చింది. ఇక, వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయాన్ని `పూర్తి చేసేశాం` అని సరిపుచ్చారు.
మరోపక్క, వరద బాధితులకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర సర్కారు విరాళాల రూపంలో తెచ్చుకున్న వాటి నుంచే ఖర్చు పెట్టింది. 700 కోట్లు విరాళాలుగా వస్తే.. 450 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. మరి ఈ విషయంలో కేంద్రం నుంచి 6800 కోట్లలో(రాష్ట్ర సర్కారు అడిగింది) కనీసం 3000 కోట్లయినా దక్కుతా యని చంద్రబాబు ఆశించారు. కానీ, ఇది అయిపోయిన ముచ్చటగా కేంద్రం స్పష్టం చేస్తోంది. మొత్తానికి.. ఈ పరిణామాలు.. బాబుకు ఇబ్బందిగానే మారాయి. ఆర్థికంగా కాసులు కురిపించకుండా.. మీ పాలన బాగుందని ప్రశంసలు మాత్రమే కురిపిస్తుండడంతో బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది!!