బీహార్ లో ఆ పార్టీదే విజయం...తొలి సంచలన సర్వే !
దేశంలో ఒక కీలక రాష్ట్రానికి ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. అదే బీహార్.
దేశంలో ఒక కీలక రాష్ట్రానికి ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. అదే బీహార్. యూపీ తరువాత మరో పెద్ద స్టేట్ గా ఉన్న బీహార్ లో ప్రస్తుతం ఎన్డీయే పాలన సాగుతోంది. బీజేపీ జేడీయూ కలసి పాలిస్తున్నాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ అధికారం కోసం ఆర్జేడీ నాయకత్వంలో ఇండియా కూటమి పోరాడుతోంది. మాజీ సీఎం లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ సీఎం కావాలని ఆకాక్షిస్తున్నారు. అంతే కాదు ఎన్నికల వ్యూహాలను రూపిందించే ప్రశాంత్ కిశోర్ సొంత పార్టీ పెట్టి పోటీకి దిగుతున్నారు.
అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని దాంతో గెలిచి తీరవచ్చని ఇండియా కూటమి భావిస్తున్న వేళ ఒక సంచలన సర్వే బయటకు వచ్చింది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన పోల్ సర్వేలో బీహార్ లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని తేల్చింది.
ఈ లేటెస్ట్ పోల్ సర్వేలో బీహార్ లో ఎన్డీయే ఓటు షేర్ కాస్తా 2024 లోక్ సభ ఎన్నికలతో పోల్చితే ఏకంగా 47 శాతం నుంచి 52 శాతానికి పెరిగింది అని పేర్కొంది. అంటే ఎనిమిది నెలల గ్యాప్ లో అయిదు శాతం పెరిగింది అన్న మాట. ఇక బీహార్ లో 40 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే 35 దాకా ఎంపీ సీట్లు ఎన్డీయే కూటమికే వస్తాయని స్పష్తం చేసింది.
ఇవే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనిపిస్తాయని అంటున్నారు. 35 ఎంపీ సీట్లను ఎమ్మెల్యే సీట్లుగా మారిస్తే కనుక 210 పైగా దక్కుతాయని తెలుస్తోంది. ఇక బీజేపీ నితీష్ కుమార్ ఎల్జేడీ కలసికట్టుగా పోటీ చేస్తే ఈ కూటమిని ఢీ కొట్టే పరిస్థితి అయితే ఎవరికీ ఉండని అంటున్నారు. ఎన్డీయే కూటమిని దించడం మాట పక్కన పెడితే గతసారి కంటే కూడా ఇండియా కూటమి సీట్లు తగ్గుతాయని ఈ సర్వే చెబుతోంది.
మరో వైపు చూస్తే బీహార్ లో అప్రతిహత విజయాన్ని నమోదు చేయాలని బీజేపీ భావిస్తోంది. తొలిసారి బీహార్ గద్దె మీద బీజేపీ సీఎం ని కూర్చోబెట్టాలని భావిస్తోంది. దాంతో గతసారి కంటే కూడా ఎక్కువ అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధపడుతోంది. 2020లో బీజేపీ 110 సీట్లలో పటీ చేస్తే 74 సీట్లను గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తే 43 మాత్రమే గెలుచుకుంది. దాంతో బీజేపీ ఈసారి 150కి తగ్గకుండా పోటీ చేస్తుందని అంటున్నారు.
అదే సమయంలో జేడీయూకి సీట్లు తక్కువ దక్కవచ్చు అంటున్నారు. అయితే ఈసారి జేడీయూ కూడా 115 సీట్లకే పోటీ పడాలని చూస్తోంది. మరి ఇందులో సీట్లు ఏ మాత్రం తగ్గినా నితీష్ కుమార్ ఊరుకుంటారా అన్నది ఒక చర్చగా ఉంది. అయితే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వే ఎండీయే కలసి ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పింది. అందువల్ల నితీష్ కుమార్ సైతం తగ్గుతారా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా ఆరు నూరు అయినా ఈసారి బీహార్ కి బీజేపీ ముఖ్యమంత్రే రాబోతున్నారు అన్నది కమలనాధులు చెబుతున్న మాట.