అల్లు అర్జున్ అరెస్ట్ పై సర్వే తెరపైకి ఆసక్తికర ఫలితాలు!
ఈ సర్వేలు పలు రకాల ప్రశ్నలు లేవనెత్తగా.. ఆసక్తికర ఆన్సర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ వైరల్ గా మారుతుంది!
అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ‘పుష్ప-2’ సినిమా విడుదలవ్వడం.. పాన్ ఇండియా లెవెల్ ల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం.. సరిగ్గా అదే సమయంలో అరెస్ట్ జరగడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ సమయంలో ఎన్.డీ.టీ.వీ., ప్రశ్నం.ఏఐ, లు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆసక్తికర ఫలితాలు తెరపైకి వచ్చాయి. ఈ సర్వేలు పలు రకాల ప్రశ్నలు లేవనెత్తగా.. ఆసక్తికర ఆన్సర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ వైరల్ గా మారుతుంది!
అవును... "పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఘటన కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందా"? అనే ప్రశ్నకు... 34% మంది 'అవును' అని సమాధానం ఇవ్వగా... దాదాపు ఇదే స్థాయిలో 33% మంది ‘కాదు’ అంటూ.. దీన్ని చట్టబద్ధమైన పోలీసు చర్యగా అంగీకరించారు.
ఇక వీరిలో 14 శాతం మంది 'చెప్పలేను' అని స్పందించగా.. 19 శాతం మంది సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు!
ఇదే సమయంలో... "క్రౌడ్ మేనేజ్ మెంట్ విషయంలో ప్రభుత్వ తన బాధ్యతను విస్మరించిందా?" అనే ప్రశ్నకు... 'అవును' అని సుమారు 41శాతం మంది స్పందించగా.. 'కాదు' అంటూ 32% మంది.. 'చెప్పలేను' అని 15% మంది.. సమాధానం చెప్పడానికి ఇష్టపడనివారు 12% మందిగా తేలారు.
కాగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది.
దీంతో... ఈ వ్యవహారంపై సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన వచ్చినట్లు కనిపించకపోయినా.. రాజకీయంగా మాత్రం పెను ప్రకంపనలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీఆరెస్స్, బీజేపీలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తూ, అరెస్టును ఖండించాయి!
ఈ విమర్శలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి... పొలిటికల్ స్టారా.. సినిమా స్టారా అనే తారతమ్యాలు తమ ప్రభుత్వం చూడదని.. తప్పు ఎవరు చేశారు అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని... చట్టం దృష్టిలో సామాన్యుడు అయినా, ప్రధాని అయినా ఒకటే అని చెబుతూ.. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ టాపిక్ తెరపైకి తెచ్చారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై జరిగిన సర్వేలో.. ప్రభుత్వాన్ని సమర్ధించేవారు, తప్పుబట్టేవారు దాదాపు సమానంగా ఉన్నట్లుగా ఫలితాలు వచ్చాయనే చర్చ తెరపైకి వచ్చింది!