సూది లేని ఇంజెక్షన్ ఇలా ఉంటుంది.. ఆసక్తికరంగా తాజా అప్డేట్

తాజాగా అలాంటి సూది లేని ఇంజక్షన్ ను బెంగళూరుకు చెందిన సంస్థ ఒకటి అందుబాటులోకి తీసుకొస్తోంది.;

Update: 2025-04-16 05:12 GMT
సూది లేని ఇంజెక్షన్ ఇలా ఉంటుంది.. ఆసక్తికరంగా తాజా అప్డేట్

ఎన్ని మందులైనా ఇవ్వండి. అవెంత చేదుగా ఉన్నా ఫర్లేదు. వేసుకుంటా. కానీ.. ఇంజక్షన్ మాత్రం వద్దు డాక్టర్.. ఇలాంటి మాటల్ని మీరు మీ ఇంట్లో వారి నుంచే విని ఉంటారు. అవును.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ట్యాబ్లెట్లు.. క్యాప్సుల్స్ ఓకే కానీ.. ఇంజెక్షన్ మాత్రం ఇవ్వొద్దంటూ కోరుకోవటం తెలిసిందే. నిజానికి ఇంజక్షన్ మీద భయం ఒకరిద్దరికో కాదు.. చాలామందిలో ఉంటుంది.

ఒక అంచనా ప్రకారం ఇంజక్షన్ల మీద భయం పిల్లల్లో 50 శాతం ఉంటుందని.. అదే పెద్దల్లో 30 శాతం ఉంటుందని చెబుతారు. నిజానికి ఈ భయం ఒక ఫోబియో. దాన్ని ట్రిపనోఫోబియాగా వ్యవహరిస్తారు.ఈ ఫోబియో ఉన్నోళ్లు ఇంజెక్షన్లు చేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు. అలా ఇంజక్షన్ అంటేనే అమడ దూరానికి పరిగెత్తే వారి కోసం సూది లేని ఇంజక్షన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కొంతకాలంగా సాగుతున్నాయి.

తాజాగా అలాంటి సూది లేని ఇంజక్షన్ ను బెంగళూరుకు చెందిన సంస్థ ఒకటి అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా దీని నమూనాను కూడా విడుదల చేశారు. ఇంటెగ్రి మెడికల్ సంస్థ.. సూది లేని ఇంజక్ష న తీసుకొస్తున్నట్లుగా చెప్పటమే కాదు.. ఆ సంస్థకుచెందిన ప్రతినిధులు దీని గురించి చెప్పుకొచ్చారు. ఇదెలా పని చేస్తుందో వివరించారు. ఎన్ ఫిన్ పేరుతో సూది లేని ఇంజెక్షన్ ను తీసుకొచ్చామన్నారు.

ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉంటే రంధ్రాల్లోకి జొప్పిస్తోందని.. దాంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి మెడిసిన్ వెళుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తాము తయారు చేసిన ఇంజెక్షన్ ను దేశ వ్యాప్తంగా వెయ్యి కంటే ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారని.. తాజాగా టీకాలు తయారు చేసే సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. త్వరలోనే సూది లేని ఇంజెక్షన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News