ట్రెండింగ్... ఇంతకంటే బాగా భారత్ పరిస్థితిని ఎవరూ వివరించలేరా?

తాజాగా ఓ నెటిజన్... భారత్ లో పరిస్థితులను వివరిస్తూ విశ్లేషణతో కూడినట్లు ఉన్న ఓ పోస్ట్ చేశారు.

Update: 2024-08-08 16:54 GMT

ప్రపంచ పటంలో భారతదేశానికి ఎప్పుడూ ప్రత్యక స్థానమే అని అంటుంటారు. ఇక్కడ వస్త్రధారణలే కానీ, సంస్కృతీ సంప్రదాయాలే కానీ, ప్రజాస్వామ్య పద్దతులే కానీ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని.. ఇదొక శాంతికాముక దేశమని అభినందిస్తుంటారు. ఈ సమయంలో ప్రస్తుతం భారతదేశం చుట్టుపక్కల ఉన్న సమస్యలను ప్రస్థావిస్తూ, అందులో భారత్ ప్రత్యేకతను చెబుతూ ఉన్న ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 

అవును... సవాళ్లతో నిండిన ఈ ప్రపంచలో భారతదేశం ప్రత్యేక స్థానంలోనే ఉంది. అయినప్పటికీ కొంతమంది భారత్ ను సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తుంటారు. వారి పైత్యం సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఓ నెటిజన్... భారత్ లో పరిస్థితులను వివరిస్తూ విశ్లేషణతో కూడినట్లు ఉన్న ఓ పోస్ట్ చేశారు. ఇది చూసినవారు.. ఇంతకంటే బాగా భారత్ పరిస్థితిని ఎవరూ వివరించలేరన్నట్లుగా స్పందిస్తున్నారు.

ఇందులో భాగంగా... భారతదేశం పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి అని మొదలుపెట్టిన సదరు నెటిజన్.. వాటిని వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుంటే.. చైనా తన ప్రభావాన్ని విస్తరించాలని తపిస్తుందని ఆరోపించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుందని వివరించారు.

ఇదే క్రమంలో శ్రీలంక ఆర్థిక పతనాన్ని ఎద్రుకోంటుండగా.. మాల్దివీవులు సవాలక్ష సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఇక వెస్ట్రన్ కంట్రీస్ విషయానికొస్తే... యూకే, ఫ్రాన్స్ లు సామాజిక అశాంతితో ఉంటే... స్పెయిన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోంటోంది.. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు ముందు అంతర్గత వివాదాల్లో చిక్కుకుందని రాసుకొచ్చారు. ఈ సమయంలోనే భారత్ లో ఉన్న తాజా పరిస్థితిని వెల్లడించారు.

ఇందులో భాగంగా... చుట్టూ ఇన్ని సమస్యలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం స్థిరంగా, సుసంపన్నంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతోందని, స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతుందని, ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా ప్రయాణించొచ్చని, పెద్దగా ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జీవితాలను గడపొచ్చని వెల్లడించారు. ఇంతా రాసుకొచ్చిన సదరు నెటిజన్... మోడీ మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాలని పేర్కొనడం గమనార్హం!

Tags:    

Similar News