చంద్రబాబు వాట్సప్ గవర్నెన్స్ ఫ్లాప్ అవ్వబోతుందా?
ఈ నెల 18న వాట్సప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్త్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్ లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
ఏపీలో చంద్రబాబు సరికొత్త ఆలోచన అని చెబుతున్న "వాట్సప్ గవర్నెన్స్" పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సర్వీసులను ఈ నెల 18నుంచి తీసుకురాబోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా.. బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ వంటి సుమారు 150 సర్వీసులు ఆన్ లైన్ చేయనున్నట్లు వెల్లడించారు.
అవును... ఈ నెల 18న వాట్సప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్త్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్ లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఈ విధానంతో గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని.. ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈ వాట్సప్ గవర్నెన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు గల సహేతుకమైన కారణం ఉందని అంటున్నారు. గతంలో ఉన్న వాలంటీర్ - గ్రామ సచివాలయ వ్యవస్థకు ఇది ప్రత్యామ్నాయం.. లేదా, అంతకు మించి అని చంద్రబాబు భావిస్తుండి ఉండొచ్చని చెబుతున్నారు.
అయితే... గ్రౌండ్ రియాలిటీ మాత్రం అలా ఉండి ఉండే అవకాశం ఉండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్లు వాట్సప్ గవర్నెన్స్ లో భాగం కావాలంటే... వారికి కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాలి.. అందులో వాట్సప్ వాడటం వచ్చి ఉండాలి. ఏపీలో ఎంతమందికి ఆ అవకాశం ఉంది అనేది ఇక్కడ కీలకమైన విషయం.
ఆంధ్రప్రదేశ్ లో కాస్త అటు ఇటుగా సగం మంది మహిళా జనాభా ఉంటే.. వారిలో ఎంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది.. ఎంత మంది అందులో వాట్సప్ వాడగలరు అనేది ఇక్కడ అత్యంత కీలకమైన విషయంగా చెబుతున్నారు. ఈ విషయంలో కనీసం 80 - 90 శాతం మహిళలు వాట్సప్ వాడే అవకాశం లేదనే చెప్పాలి అని చెబుతున్నారు.
దీంతో... చంద్రబాబు చెప్పే ఈ వాట్సప్ గవర్నెన్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ/వార్డు సచివాలయం ద్వారా వాలంటీర్లతో ఈ తరహా సర్టిఫికెట్లను డోర్ డెలివరీ చేయించేవారు! విలేజ్ / వార్డ్ సెక్రటేరియట్ లో చెబితే పని అయిపోతుందనే కామెంట్లు వినిపించేవి.
అయితే.. అంతకు మించి సులువైన, సౌకర్యవంతమైన సర్వీస్ అందించాలని చంద్రబాబు భావించి ఉండొచ్చు కానీ... గ్రౌండ్ లెవెల్ లో ప్రాక్టికల్ గా అది ఎంతవరకూ సాధ్యం, నిజంగా ఆఫీసులకు వెళ్లి ఆ పనులు చేయించుకోలేని వారికి ఇది ఏ మేరకు సహాయపడుతుందనే విషయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే... చంద్రబాబు వాట్సప్ గవర్నెన్స్ అట్టర్ ప్లాప్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లున్నాయి అనే చర్చ ఓ వర్గంలో మొదలైంది. మరి ఈ స్మార్ట్ ఫోన్, వాట్సప్ వాడకం విషయంలో జనాలను చంద్రబాబు ఏ మేరకు అప్ డేట్ చేస్తారు?.. అంగన్ వాడీ టీచర్స్ కి ఇచ్చినట్లు ఏపీలోని మహిళలందరికీ లిమిటెడ్ యాప్స్ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా అందించే ఆలోచన చేస్తారా? అనేది వేచి చూడాలి.
అలా కాని పక్షంలో... చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన వాట్సప్ గవర్నెన్స్ కోసమని స్మార్ట్ ఫోన్ కొనుక్కుని, వాట్సప్ అలవాటు చేసుకుని సిద్ధంగా ఉంటారా సామాన్య ప్రజానికం అంటే... ప్రభుత్వ పెద్దలకే తెలియాలి!!