షర్మిలక్క కొత్త డైలాగ్.. రీల్స్ లో ట్రోల్స్!

ఈ క్రమలో ఎన్నో ఉదాహరణలు అటు సినిమా రంగానికి చెందినవారి నుంచీ, ఇటు రాజకీయ రంగానికి చెందిన వారి నుంచీ ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-16 05:35 GMT

సెలబ్రెటీ, లెజెండ్ అనే ట్యాగ్ లైన్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ మీటింగ్స్ లోనూ, మీడియా మైకుల ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచి తూచి మాట్లాడాలని అంటారు. అలా కానిపక్షంలో గతంలో సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇప్పుడైతే నెట్టింట ఆడేసుకుంటారు ట్రోలర్స్ అండ్ మీమర్స్! దీంతో... వారికి ఒక ముడిసరుకుగా మారిపోయే పరిస్థితి!

ఈ క్రమలో ఎన్నో ఉదాహరణలు అటు సినిమా రంగానికి చెందినవారి నుంచీ, ఇటు రాజకీయ రంగానికి చెందిన వారి నుంచీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొంతమంది విషయంలో అయితే.. వాళ్లు మైకుల ముందుకు ఎప్పుడు వస్తారా? అని పలువురు ఎదురు చూస్తుంటారు. వాళ్లు వస్తే కచ్చితంగా బోలెడంత ముడిసరుకు దొరుకుతుందని మీమర్స్ తాపత్రయం.

ఆ సంగతి అలా ఉంటే... వైఎస్ షర్మిళ తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచీ బలంగా మీమర్స్ కి కొన్ని సందర్భాల్లో దొరికేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా... 'ఆడపిల్ల', 'పాదయాత్ర' వంటి పదాలకు ఆమె తనదైన శైలిలో చెప్పిన అర్ధాలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఈ సమయంలో మరోసారి షర్మిల డైలాగ్ వైరల్ గా మారింది.

అవును... "ఆడపిల్ల పుట్టగానే ఆడ పిల్ల అని అంటారు.. అంటే ఈడ పిల్ల కాదు, ఆడ పిల్ల అని అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకంటున్నారో తెలుసా?.. మీ ఆవిడ కాబట్టి!" అంటూ గతంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు లోకల్, నాన్ లోకల్ ఇష్యూ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యల ఏ స్థాయిలో వైరల్ అయ్యాయనేదీ తెలిసిన సంగతే!

ఇదే సమయంలో... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 - ఫిబ్రవరి నెలలో... "రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నారు.. దాన్ని పాదయాత్ర అంటారా.. అది స్పెల్లింగ్ మిస్టేక్.. పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర.. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని చెప్పి పాదయాత్రను అవమానించకండి" అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా మరోసారి షర్మిల నోటి నుంచి జాలువారిన ఓ డైలాగ్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో భాగంగా... "ఐయామ్ ష్యూర్ ఎవ్రిబడీ హేజ్ కామన్ సెన్స్.. కామన్ సెన్స్ ఈజ్ కామన్ ఫర్ ఎ రీజన్.. బికాజ్ ఇట్ ఈజ్ కామన్" అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!

ఈ విధంగా కామన్ సెన్స్ అని ఎందుకంటారంటే అది అందరికీ కామన్ కాబట్టి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా... "అసలేం చెప్పార్రా..?" అని ఒకరంటే.. "అసలు ఏమి చెప్పార్రా?" అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. "ఇలాంటివి అక్క వద్ద ఎన్నో ఉన్నాయి.. దీనికే ఇలా అయిపోతే ఎలా?" అని ఇంకొకరు స్పందించారు.

Full View
Tags:    

Similar News